Tirupparankundram KarthigaiDeepam

తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన అనుమతిపై స్టే విధించింది. ఈ ఏడాదికి ఒక్కసారి మాత్రమే దీపం వెలిగించేందుకు అనుమతించింది. ఈ నెల 24న కార్తీక దీపం వెలిగించేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఆలయ దేవస్థానం నుంచి అనుమతి పొందిన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే కొండపైకి వెళ్లి దీపం వెలిగించాలని(Tirupparankundram KarthigaiDeepam) స్పష్టం చేసింది. అక్కడికి సాధారణ ప్రజలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది.

మధురైలోని తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపత్తూన్ అనే రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలన్న డిమాండ్‌తో వివాదం మొదలైంది. ఈ కొండపై సుబ్రమణ్యస్వామి ఆలయంతో పాటు దర్గా కూడా ఉండటంతో దీపం వెలిగించే ప్రదేశం, ఆ ప్రాంతంపై హక్కులు, సంప్రదాయాల విషయంలో వివాదం ఏర్పడింది. గతంలో మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశించింది. ఆ తర్వాత డివిజన్ బెంచ్ కూడా ఆ తీర్పును సమర్థించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24న కార్తీక దీపం సందర్భంగా ఆలయ దేవస్థానం నుంచి అనుమతి పొందిన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే కొండపైకి వెళ్లి దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ ఒక్కసారి ఇచ్చిన అనుమతిని భవిష్యత్తులో సంప్రదాయ హక్కుగా లేదా ప్రతి ఏడాది దీపం వెలిగించేందుకు హక్కుగా పరిగణించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొండపై శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను(Tirupparankundram KarthigaiDeepam) ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంతో వివాదానికి పూర్తిగా తెరపడినట్లు కాదు. దీపం వెలిగించే ప్రదేశం, ఆ ప్రాంతంపై హక్కులు, సంప్రదాయాలపై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర తీర్పుతో తిరుప్పరకుండ్రం కార్తీక దీపం వివాదం ఏ మలుపు తిరగనుంది? నవంబర్ 24న కొండపై దీపం వెలిగించే కార్యక్రమం ఎలా జరగనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.