తమిళనాట ఉప ఎన్నిక ఉత్కంఠ! కొళత్తూర్‌లో మళ్లీ పోటీకి సిద్ధమా?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొళత్తూర్ నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో జరగనున్న ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది.

MK Stalin Kolathur By-Election
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొళత్తూర్ నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు గురువారం కన్నుమూసారు. ఆయన
మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ బైపోల్ జరగనుంది. ఆ ఉప ఎన్నికపై(MK Stalin Kolathur By-Election) ఆసక్తి నెలకొంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151A ప్రకారం సాధారణంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
స్టాలిన్ పోటీ చేస్తారా?
స్టాలిన్ 2011 నుంచి ప్రాతినిధ్యం వహించిన కొళత్తూర్‌లో 2026 ఎన్నికల్లో వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఆ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 82,997 ఓట్లు సాధించగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు వచ్చాయి. ఇది కేవలం ఒక నియోజకవర్గంలో జరిగిన ఓటమి మాత్రమే కాదు.. డీఎంకే అధినేతను ఆయన సొంత రాజకీయ కంచుకోటలో ఓడించిన ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఒకప్పుడు డీఎంకేలో కీలకంగా పనిచేసిన నాయకుడే.. అదే పార్టీ అధినేత స్టాలిన్‌ను ఓడించడం అప్పట్లో రాజకీయంగా ప్రత్యేక చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే స్థానం నుంచి స్టాలిన్(MK Stalin Kolathur By-Election) మరోసారి బరిలోకి దిగితే అది డీఎంకేకు రాజకీయంగా కీలకమైన పోరుగా మారుతుంది. స్టాలిన్ మళ్లీ కొళత్తూర్ నుంచి పోటీ చేయాలన్న అభిప్రాయాలు డీఎంకే వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ ఎంపీ సి. రవీంద్రన్ కూడా స్టాలిన్ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని, తుది నిర్ణయం మాత్రం స్టాలిన్‌దేనని వెల్లడించారు. అయితే ఆయన పోటీపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రతిష్ఠాత్మక పోరు!
మరోవైపు, కొళత్తూర్‌ను నిలబెట్టుకోవడం టీవీకేకు కూడా కీలకమే. వీఎస్ బాబు స్థానంలో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీకి దింపే అవకాశాన్ని కూడా టీవీకే వర్గాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాలిన్‌పై సాధించిన విజయాన్ని ఉప ఎన్నికలోనూ కొనసాగించాలని ఆ పార్టీ భావించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2026 ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత కొళత్తూర్‌లో విజయం సాధించడం డీఎంకేకు ప్రతిష్ఠాత్మకంగా మారుతుంది. ఒకవేళ స్టాలిన్(MK Stalin Kolathur By-Election) మరోసారి పోటీ చేసి ఓడిపోతే, ఇప్పటికే ఎదుర్కొన్న రాజకీయ పరాజయానికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతుంది. అందువల్ల ఆయన స్వయంగా పోటీ చేయాలా? లేక పార్టీకి చెందిన మరో బలమైన నాయకుడిని రంగంలోకి దించాలా? అనేది డీఎంకే నాయకత్వం ఆలోచించాల్సిన అంశం.
ఉత్కంఠ రాజకీయం !
మొత్తానికి కొళత్తూర్ ఉప ఎన్నిక తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర అధ్యాయానికి తెరతీయనుంది. కొళత్తూర్ ఉప ఎన్నిక ఒక ఎమ్మెల్యే స్థానానికి జరిగే సాధారణ పోటీ మాత్రమే కాదు. 2026 ఎన్నికల్లో స్టాలిన్‌ను(MK Stalin Kolathur By-Election) ఓడించిన టీవీకే తన విజయాన్ని కొనసాగిస్తుందా? డీఎంకే తన పాత పట్టును తిరిగి సాధిస్తుందా? అన్నది తేల్చే కీలక రాజకీయ పరిణామం. స్టాలిన్ స్వయంగా బరిలోకి దిగుతారా లేదా అన్నదే ఇప్పుడు ఈ రాజకీయ కథలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న.



