Ajit Doval US Court Summons

ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్‌ దోవల్‌ పేరు మరోసారి ప్రపంప స్థాయిలో వినిపిస్తోంది. ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌.. అమెరికాలో దాఖలు చేసిన సివిల్‌ దావా కేసులో న్యూయార్క్‌లోని ఫెడరల్‌ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అజిత్‌ దోవల్‌తో పాటు రా మాజీ చీఫ్‌ సమంత్‌ గోయల్‌కు న్యాయపరమైన సమన్లు అందజేయడానికి భారతదేశంలోని స్థానిక కోర్టుల సహకారం(Ajit Doval US Court Summons) తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో మరోసారి భారత్‌-అమెరికా మధ్య దౌత్య, న్యాయపరమైన చర్చలకు దారితీసింది.

దావాలో ఏముంది?
ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ తనను హతమార్చేందుకు భారత అధికారులు కుట్ర పన్నారంటూ అమెరికాలో సివిల్‌ దావా దాఖలు చేశాడు. ఈ కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, రా మాజీ చీఫ్‌ సమంత్‌ గోయల్‌ పాత్ర ఉందని పన్నూన్‌ ఆరోపించాడు. ఈ ఆరోపణలపై పరిహారం కోరుతూ అమెరికా కోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు అందజేసేందుకు న్యూయార్క్‌ సదరన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. హేగ్‌ కన్వెన్షన్‌, భారత సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ నిబంధనలను ప్రస్తావిస్తూ స్థానిక భారతీయ న్యాయస్థానాల ద్వారా సమన్లు అందించే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అజిత్‌ దోవల్‌కు సంబంధించిన సమన్లను ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ జిల్లా కోర్టుకు పంపించాలని, సమంత్‌ గోయల్‌కు సంబంధించిన పత్రాలను ద్వారకా, తీస్‌ హజారీ జిల్లా కోర్టులకు పంపించాలని అమెరికా కోర్టు తన క్లర్క్‌ను ఆదేశించింది. ఈ సివిల్‌ కేసులో ప్రతివాదులకు న్యాయపరమైన పత్రాలు అందేలా భారత కోర్టులు(Ajit Doval US Court Summons) సహకరించాలని కోరింది.

గతంలో సమన్లు ఎందుకు అందలేదు?
ఈ వ్యవహారంలో అంతకుముందు దౌత్య మార్గాలు, హేగ్‌ కన్వెన్షన్‌ ప్రక్రియ ద్వారా సమన్లు పంపే ప్రయత్నాలు జరిగాయి. అయితే వాటిని భారత్‌ అంగీకరించలేదు. దీంతో భారత సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని నిబంధనలను ఆధారంగా చేసుకుని స్థానిక కోర్టుల ద్వారా పత్రాలు అందించే ప్రత్యామ్నాయ మార్గాన్ని(Ajit Doval US Court Summons) ఎంచుకుంది. సమన్లు అందజేయడం అనేది కేసులో న్యాయపరమైన ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. ఆరోపణలపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.

భారత్‌ ఇప్పటికే స్పష్టం ?
అయితే పన్నూన్‌ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. ఈ దావా కల్పితమైనది, దురుద్దేశపూర్వకమైనదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధార ఆరోపణలను భారత్‌ అంగీకరించదని స్పష్టం చేసింది. న్యాయపరమైన పత్రాల అందజేత విషయంలో కేంద్ర న్యాయశాఖ ద్వారానే ప్రక్రియ జరగాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు. అమెరికా కోర్టు(Ajit Doval US Court Summons) ఆదేశాల ప్రకారం ఢిల్లీలోని సంబంధిత కోర్టులకు సమన్లు చేరిన నేపథ్యంలో తదుపరి ప్రక్రియ ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. భారత న్యాయస్థానాలు ఈ పత్రాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? సమన్లు సంబంధిత వ్యక్తులకు అందుతాయా? భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? అనే అంశాలపై ఇప్పుడు దృష్టి నెలకొంది.