ఒంటినిండా కిలోలకొద్దీ బంగారం. ఎవరీ ఇండియన్ గోల్డ్ మ్యాన్?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా కుందాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ నాయకుడు రాజా భయ్యా ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామకథ కార్యక్రమంలో గోల్డ్ మ్యాన్ హంగామా సృష్టించాడు. ఆధ్యాత్మిక వేడుకలో బిహార్‌కు చెందిన ప్రేమ్ కుమార్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Indian Golden Man
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా కుందాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ నాయకుడు రాజా భయ్యా ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామకథ కార్యక్రమంలో గోల్డ్ మ్యాన్ హంగామా సృష్టించాడు. ఆధ్యాత్మిక వేడుకలో బిహార్‌కు చెందిన ప్రేమ్ కుమార్ సింగ్(Indian Golden Man) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన సాధారణ భక్తుడిలా కాకుండా ఒంటినిండా బంగారు ఆభరణాలతో కార్యక్రమానికి రావడంతో అందరి చూపు ఆయనపైనే పడింది.
అందరిచూపు ఆయన గోల్డ్‌పైనే!
ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చిన ప్రేమ్ కుమార్ సింగ్ మెడలో భారీ బంగారు గొలుసులు.. చేతులకు కిలోల కొద్దీ బ్రాస్లెట్లు.. ఒళ్లంతా పసిడి ఆభరణాలే కనిపిండంతో అందరి కళ్లు ఆయనమీద పడ్డాయి. దాదాపు 6.3 కిలోల బంగారాన్ని ధరించి వచ్చిన ఆయన ఆభరణాల విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. మెడలో ఒకదానిపై మరొకటి ఉండేలా భారీ బంగారు గొలుసులు, చేతులకు బ్రాస్లెట్లు, ఇతర పసిడి నగలతో ఆయన కనిపించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఆయనే ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మారిపోయారు. ఆయన్ను చూసేందుకు భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో దగ్గరకు చేరుకున్నారు. కొందరు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మరికొందరు ఆ భారీ బంగారు ఆభరణాలను ఆసక్తిగా పరిశీలించారు. రాజా భయ్యా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంపై ప్రేమ్ కుమార్ సింగ్(Indian Golden Man) తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఏఏ నగలు ఉన్నాయి!
నగలు ధరించడం చాలామందికి ఇష్టం. మరికొందరికి బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం. కానీ బంగారంతోనే తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్న వ్యక్తి ప్రేమ్ కుమార్ సింగ్. ఈయన స్వస్థలం బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన వాసుదేవ్పూర్ గ్రామం. ప్రేమ్ సింగ్‌కు చిన్నప్పటి నుంచే బంగారం అంటే ఇష్టం. వ్యవసాయం, కాంట్రాక్టు పనులు ఆయన వృత్తి. ఈయన సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు వెచ్చిస్తూ వచ్చారు. అలా మొదలైన ఆయన బంగారు ఆభరణాల అభిమానం నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రజెంట్ ఆయన దగ్గర 38 గొలుసులు, 10 ఉంగరాలు, మూడు కడియాలు(Indian Golden Man) ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రేమ్ కుమార్ సింగ్ దగ్గర 24 క్యారెట్ల బంగారు పూతతో అలంకరించిన ప్రత్యేక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఉన్నట్లు టాక్. ఒంటినిండా బంగారు నగలు… రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించే బంగారు బైక్… ఇలా తనకంటూ ఒక విభిన్నమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
బంగారం చోరీ!
ఇంత బంగారం ఒంటిపై వేసుకుని బయట తిరగడం అంటే ఎంతటి సాహసమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకసారి ప్రేమ్ సింగ్‌పై దుండగులు దాడి చేసి, తుపాకీతో బెదిరించి ఆయన బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు 2023లో కథనాలు వచ్చాయి. అయితే పోలీసులు ఆ ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకుని ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ ఘటన తర్వాత ఆయన బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రేమ్ కుమార్ సింగ్ ధరించే ఆభరణాల్లో హనుమంతుడి లాకెట్(Indian Golden Man) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన బంగారు ఆభరణాల సేకరణలో హనుమంతుడి ప్రతిమకు ప్రత్యేక స్థానం ఉంది. బంగారం పట్ల అభిమానం ఒకవైపు ఉంటే, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మరోవైపు ఆయన అలవాటు.
ప్రధాని పిలుపుతో..!
అయితే ఇటీవల ప్రేమ్ కుమార్ సింగ్ బంగారం (Indian Golden Man)కొనడం ఆపేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న పిలుపు నేపథ్యంలో తాను కొత్తగా బంగారం కొనడం నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా… బంగారంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బీహార్ గోల్డ్ మ్యాన్ ప్రేమ్ కుమార్ సింగ్ కథ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.
रामकथा में पहुंचे ‘गोल्डनमैन ऑफ बिहार’….
कुंडा में राजा भैया द्वारा आयोजित श्रीराम कथा को लेकर एक अलग नजारा देखने को मिल रहा है. बागेश्वर धाम के पंडित धीरेंद्र कृष्ण शास्त्री कथा सुना रहे हैं. कथा में पहुंचे एक ऐसे शख्स ने लोगों का ध्यान खींचा, जिनकी पहचान ही सोने के गहनों से है. गले में मोटी-मोटी सोने की चेन, हाथों में भारी कड़े, उंगलियों में अंगूठियां और शरीर पर सिर से पांव तक सोना है.. बिहार के भोजपुर जिले के रहने वाले प्रेम सिंह जिन्हें ‘गोल्डनमैन ऑफ बिहार’ कहा जाता है. वह सवा छह किलो से ज्यादा सोना पहनकर कुंडा पहुंचे. प्रेम सिंह का शौक सिर्फ सोने के गहनों तक सीमित नहीं है. उनके पास एक खास बुलेट बाइक भी है, जिस पर 24 कैरेट सोने की परत चढ़ी होने की बात कही जाती है. उनकी यह गोल्डन बुलेट भी लोगों के बीच काफी लोकप्रिय है.
#kundapratapgarh #RamKatha #RajaBhaiya #Kunda— Kishor Joshi (@KishorJoshi02) November 20, 2026



