పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత్ మెరుగు. ఇకపై ఎన్ని దేశాలకు వెళ్లొచ్చంటే..!
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అక్టోబర్ 2026 తాజా ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌పోర్ట్ 84వ స్థానంలో నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో 85వ స్థానంలో ఉన్న భారత్.. ఈసారి ఒక స్థానం మెరుగుపరుచుకుంది.

India Passport Ranking
భారత్ పాస్ పోర్టు పొందారా? అయితే కొత్త వచ్చిన నిబంధనల ప్రకారం మీరు ఇండియా పాస్ట్ పోర్టుతో ఎన్ని దేశాలు తిరగొచ్చో తెలుసా? అయితే వివరాలు చూడండి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అక్టోబర్ 2026 తాజా ర్యాంకింగ్స్‌లో భారత పాస్‌పోర్ట్ 84వ స్థానంలో నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో 85వ స్థానంలో ఉన్న భారత్.. ఈసారి ఒక స్థానం మెరుగుపరుచుకుంది. అయితే ర్యాంకింగ్‌లో పురోగతి కనిపించినప్పటికీ, వీసా లేకుండా ప్రయాణించే దేశాల అవకాశాలు మాత్రం తగ్గాయి. గతంలో భారత పాస్‌పోర్ట్‌తో ముందస్తు వీసా అవసరం లేకుండా .. వీసా ఆన్ అరైవల్ సదుపాయంతో 57 దేశాలకు వెళ్లే అవకాశం ఉండేది. తాజాగా ఆ సంఖ్య 55కు పడిపోయింది.అంటే ర్యాంకు మెరుగైనప్పటికీ, భారతీయ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వీసా సౌలభ్యాలు( India Passport Ranking) తగ్గాయి.తాజా జాబితాలో భారత్‌తో పాటు అల్జీరియా, మారిటేనియా దేశాలు కూడా 84వ ర్యాంకును పంచుకున్నాయి. మరోవైపు సింగపూర్ తన అగ్రస్థానాన్ని కంటిన్యూ చేస్తోంది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్నవారు ముందస్తు వీసా లేకుండానే 193 దేశాలు, ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛలో సింగపూర్ పాస్‌పోర్ట్ ఆధిపత్యం కంటిన్యూ అవుతోంది.
ఎలా నిర్ణయిస్తారు?
ప్రపంచవ్యాప్తంగా 199 దేశాల పాస్‌పోర్ట్‌లు, 227 ప్రయాణ గమ్యస్థానాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకులను రూపొందిస్తుంది. ఒక దేశ పౌరులు ముందస్తు వీసా తీసుకోకుండా ఎన్ని దేశాలు, ప్రాంతాలకు వెళ్లగలుగుతున్నారనే అంశం ఈ ర్యాంకింగ్‌లో ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.ఈ గణాంకాలను పరిశీలిస్తే భారత పాస్‌పోర్ట్ ర్యాంకులో స్వల్పంగా మెరుగుపడినా, అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ విషయంలో ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయి. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే భారతీయులకు అందుబాటులో ఉన్న వీసా( India Passport Ranking) రహిత ప్రయాణాలు తక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో ఒక స్థానం పైకి ఎగబాకడం సానుకూల పరిణామమే అయినా, వీసా రహిత ప్రయాణ అవకాశాలు 57 నుంచి 55కు తగ్గడం భారత ప్రయాణికులు చింతించాల్సిన విషయం.



