Trump Midterm Election Challenge

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇప్పుడు మరో సవాల్ ఎదురైంది. అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికలు ఆయనకు ఛాలెంజ్‌గా మారాయి. అమెరికాలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు ట్రంప్‌. గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్లకు బంఫర్ ఆఫర్లు సైతం ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీని గెలిపిస్తే… 18 ఏళ్లు నిండిన అమెరికన్లందరికీ 5 వేల డాలర్ల చొప్పున ఇస్తానంటూ ఆకర్షణీయమైన బహుమతులు ఆఫర్‌ చేశారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీ (Trump Midterm Election Challenge)గెలవడం అంత తేలిక కాదని చరిత్ర చెబుతోంది. ఇక చరిత్రలోకి వెళ్తే.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. గత పాతికేళ్లలో ఒక్కసారి మాత్రమే అధికార పార్టీ మధ్యంతర ఎన్నికల్లో గెలిచింది. 2002లో జార్జి బుష్ హయాంలో రిపబ్లిక్ పార్టీ గెలిచింది. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. దీంతో దేశం మొత్తం ఏకతాటిపైకి రావడంతో… మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీ ఏకపక్షంగా గెలిచింది. అంతకుముందు బిల్‌క్లింటన్, రూజ్‌వెల్ట్‌ హయాంలోనూ మధ్యంతర ఎన్నికల్లో అధికారపార్టీ విజయం సాధించింది. ఇప్పడు ట్రంప్‌కి ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు నచ్చితే ఓకే లేదంటే మాత్రం బొక్క బోర్లాపడతారనేది నిపుణుల మాట.

అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడి పాలన కాలం సగం పూర్తయ్యాక అంటే రెండేళ్లకు మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతినిధుల సభలోని 435 సీట్లతోపాటు సెనేట్‌లోని 35 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి పార్లమెంట్‌లో బలం ఉంటుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోతే(Trump Midterm Election Challenge) అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం రాదుకాని.. అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలకు, ఒంటెద్దు పోకడలకు ఇక నుండి కళ్లేం వేస్తారు. దీంతో ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ట్రంప్. తన పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండంలా భావిస్తున్నారు. షో అమెరికా ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.

అమెరికా ఎన్నికల నిబంధనల ప్రకారం మధ్యంతర ఎన్నికల(Trump Midterm Election Challenge)ను నవంబర్ నెల మొదటి వారంలో నిర్వహిస్తారు. భారత్‌లో లోక్ సభ, రాజ్యసభ ఉన్నట్లే… అమెరికా పార్లమెంట్‌లోనూ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ ఉంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ ను ప్రతినిధుల సభ లేదా దిగువ సభ అంటారు. ఇందులో 435 స్థానాలు ఉంటాయి. సెనేట్‌ లేదా ఎగువసభలో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. దిగువ సభ సభ్యులు పదవీ కాలం రెండేళ్లు. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మన రాజ్యసభ సభ్యుల్లాగే సెనెటర్ల పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. సెనేట్‌లో మూడో వంతు స్థానాలకు ప్రతి రెండేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతాయి. దిగువ సభలో జనాభా ఆధారంగా రాష్ట్రాలకు సీట్లను కేటాయిస్తారు. సెనేట్‌లో మాత్రం ప్రతి రాష్ట్రానికి రెండు చొప్పున సీట్లు ఉంటాయి.