మలేషియా కొత్త రూల్స్.. ఇకపై వీసా కంపల్సరీ!
ఇండియన్ టూరిస్టులకు మలేషియా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై వీసా లేకపోతే మలేషియాలోకి నో ఎంట్రీ అంటూ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 30రోజుల నో వీసా రూల్స్ కు బ్రేక్ వేసింది. జనవరి ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ పాస్ చేసింది.

Malaysia Visa Rules for Indians
మలేషియా టూర్‌కి ప్లాన్ చేసున్నారా? అయితే ఆదేశం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కొంచెం సరిచూసుకోండి. 2027 జనవరి 1నుంచి మలేషియాలో పర్యటించాలంటే వీసా కంపల్సరీ చేస్తూ రూల్స్ పాస్ చేసింది. భారతీయులకు వీసా రహిత ప్రవేశ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు మలేషియా ఇమ్మిగ్రేషన్ విభాగం(Malaysia Visa Rules for Indians) ప్రకటించింది. దీంతో కొత్త ఏడాదిలో మలేషియా వెళ్లాలనుకునే భారతీయులు ముందుగానే వీసా పొందాల్సి ఉంటుంది. భారతీయులకు మలేషియా ప్రభుత్వం ఇప్పటివరకు వీసా లేకుండానే మలేషియాలో 30 రోజుల వరకు పర్యటించే అవకాశం కల్పించింది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలన్నా, స్నేహితులతో టూర్ ప్లాన్ చేసుకున్నా వీసా కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇకపై ఈ వెసులుబాటును తీసేసింది. 2027 జనవరి 1 నుంచి భారతీయులకు కొత్త వీసా రూల్స్ జారీ చేసింది. నవంబర్ 17న విడుదల చేసిన ప్రకటనలో మలేషియా ఇమ్మిగ్రేషన్ విభాగం (JIM) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత వీసా మినహాయింపు సదుపాయం 2026 డిసెంబర్ 31 వరకు(Malaysia Visa Rules for Indians) కొనసాగుతుంది.
డిసెంబర్ 1 నుంచే వీసా అప్లికేషన్స్ !
కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే ప్రయాణికులు సిద్ధం కావాలని మలేషియా ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2026 డిసెంబర్ 1 నుంచి ‘MyVISA’ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇండియన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 1 లేదా ఆ తర్వాత మలేషియా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నవారు వీసా ప్రక్రియను ముందుగానే పూర్తి చేసుకోవడం అవసరం. వీసా మంజూరు కాకముందే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక సందర్శకులు తమ పర్యటన మొత్తం కాలానికి ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని కూడా మలేషియా ఇమ్మిగ్రేషన్(Malaysia Visa Rules for Indians) విభాగం సూచించింది. విదేశీయులు అక్కడ వైద్య చికిత్స పొందితే సంబంధిత ఖర్చులను వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఏడు రోజులు దాటితే రద్దు!
వీసా దరఖాస్తులకు సంబంధించి మరో కీలక నిబంధనను కూడా మలేషియా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ‘New Application’ లేదా ‘Pending Payment’ స్థితిలో ఏదైనా దరఖాస్తు ఏడు పని దినాలకు మించి పెండింగ్‌లో ఉంటే అది ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. ఈ నిబంధన 2026 అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 1కి ముందే సమర్పించిన దరఖాస్తులకు కూడా ఇది వర్తిస్తుంది. ఒకవేళ దరఖాస్తు గడువు ముగిసి రద్దయితే, ప్రయాణికులు తాజా వీసా దరఖాస్తు ఫారంతో మళ్లీ అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, వీసా మంజూరైనా, తిరస్కరణకు గురైనా చెల్లించిన దరఖాస్తు రుసుము(Malaysia Visa Rules for Indians) తిరిగి ఇవ్వరు. ప్రభుత్వ విధానాల్లో మార్పులు వచ్చినా, ప్రయాణ ప్రణాళికలు మార్చుకున్నా ఫీజు రీఫండ్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
ట్రావెల్ ఇన్సూరెన్స్!
కొత్త వీసా విధానంలో ప్రయాణ వైద్య బీమాకు కూడా ప్రాధాన్యం కల్పించారు. మలేషియాలో పర్యటించే విదేశీయులు తమ బస వ్యవధి మొత్తానికి వర్తించే ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ఇమ్మిగ్రేషన్ విభాగం సూచించింది. ఈ బీమాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని వీసా దరఖాస్తుకు సహాయక పత్రంగా ఉపయోగించవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో వైద్య అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే ‘MyTripPass’ ఇన్‌బౌండ్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ అందించే బీమా ధ్రువీకరణ పత్రాన్ని కూడా ప్రస్తావించింది. విదేశీయులు మలేషియాలో పొందే వైద్య సేవలకు సంబంధించిన ఖర్చులను స్వయంగా (Malaysia Visa Rules for Indians)భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
నిర్ణయం వెనుక కారణం?
మలేషియాలో 30 రోజుల వీసా రహిత ప్రవేశ సదుపాయాన్ని కొందరు ఉద్యోగాల కోసం ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు గతంలో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ కూడా సెప్టెంబర్‌లో భారతీయులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. పర్యాటక ప్రయోజనాల కోసం కల్పించిన వీసా రహిత సదుపాయాన్ని ఉద్యోగాల అన్వేషణకు ఉపయోగించుకోవద్దని హెచ్చరించింది. తప్పుడు ఉద్యోగ హామీలతో ఏజెంట్ల చేతిలో మోసపోయి మలేషియా(Malaysia Visa Rules for Indians) వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని భారత హైకమిషన్ పేర్కొంది. సరైన వర్క్ పర్మిట్ లేదా సంబంధిత వీసా లేకుండా ఉద్యోగాల కోసం వెళ్లవద్దని సూచించింది. అయితే వీసా మినహాయింపు రద్దుకు ఇదే ఏకైక కారణమని మలేషియా ప్రభుత్వం ప్రకటించలేదు.



