Thiruparankundram Karthigai Deepam Row

లెక్కలేదా.. తీవ్ర ఆగ్రహం

తిరుప్పరంకుండ్రం దీపం వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి విజయ్ సర్కార్‌పై సీరియస్ అయింది.కోర్టు ఆదేశాలు ఇచ్చాకకూడా తమాషాలు చేస్తున్నారా అంటూ ఫైర్ అయింది.
కోర్టు ఆదేశాలను వెనువెంటనే అమలు చేయాల్సిందే.. ఇందులో ఎలాంటి చర్చలకు తావులేదని హెచ్చరించింది.గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మదురై కలెక్టర్‌కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. శనివారం (నవంబర్ 28)నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాతి స్తంభంపై కార్తిక దీపం(Thiruparankundram Karthigai Deepam Row) వెలిగించాలని స్పష్టం చేసింది.కోర్టు ఆదేశాలతో తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక పౌర్ణమి దీపం వెలిగించే వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది.

రాతి స్తంభమే వివాదానికి కేంద్రం!
తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంలో కార్తిక మహాదీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సిక్కందర్ దర్గా సమీపంలోని పురాతన రాతి స్తంభంపై కూడా దీపం వెలిగించాలనే డిమాండ్‌తో కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. గత ఏడాది మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం రాతి స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించినప్పటికీ అమలు కాలేదు. ఈ నేపథ్యంలో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఏడాది రాతి స్తంభంపై దీపం(Thiruparankundram Karthigai Deepam Row) వెలిగించేందుకు అనుమతిస్తూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆదేశాలు ఉన్నప్పటికీ పాత దీప మండపంలోనే మహాదీపం వెలిగించడంతో మరోసారి న్యాయపోరాటం మొదలైంది.

ట్రస్టీ బోర్డు సస్పెండ్..
ఈ విచారణలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు తమను రాతి స్తంభం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. కొండపై శాంతిభద్రతల పరిరక్షణకు 5 వేలకు పైగా పోలీసులను మోహరించినట్లు మదురై పోలీసు కమిషనర్ వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌లు అరవింద్ కుమార్, విపుల్ ఎం. పంచోలీల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ట్రస్టీల బోర్డు(Thiruparankundram Karthigai Deepam Row)ను సస్పెండ్ చేసి, ఆలయ నిర్వహణ బాధ్యతలను మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లకు అప్పగించింది. ఆలయం, కొండతో పాటు సమీపంలోని దర్గాకు కూడా సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని ఆదేశించింది. నవంబర్ 28న రాతి స్తంభంపై దీపం వెలిగించాలని, దర్గా నుంచి అన్ని వైపులా కనీసం 50 మీటర్ల దూరం పాటించాలని స్పష్టం చేసింది. ఈ వివాదంపై తదుపరి విచారణలో తమిళనాడు సీఎస్ వ్యక్తిగతంగా హాజరై అధికారుల మధ్య జరిగిన సమాచార మార్పిడికి సంబంధించిన వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. అయితే ఈ ఒక్కసారి దీపం వెలిగించేందుకు ఇచ్చిన అనుమతి మాత్రమేనని, కొండపై హక్కులకు సంబంధించిన తుది నిర్ణయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.