ముంబైలో ఆందోళన .. అమితాబ్‌తో పాటు పలువురికి బాంబ్ బెదిరింపు
26/11 దాడుల 18వ వార్షికోత్సవం వేళ ముంబైలో బాంబు బెదిరింపులు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి.బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇంటికీ బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అంతేకాదు.. ముంబై మేయర్ రితూ తావ్డే కార్యాలయం, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ అశ్విని భిడేకు కూడా బెదిరింపు ఈ-మెయిల్స్ అందాయి.

Mumbai Security Alert
26/11 దాడుల 18వ వార్షికోత్సవం వేళ ముంబైలో బాంబు బెదిరింపులు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి.బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇంటికీ బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అంతేకాదు.. ముంబై మేయర్ రితూ తావ్డే కార్యాలయం, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ అశ్విని భిడేకు కూడా బెదిరింపు ఈ-మెయిల్స్ అందాయి. అలాగే ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ ఈవెంట్ జరిగే వేదికను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడం(Mumbai Security Alert) తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీంతో ముంబై పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ బెదిరింపు సందేశాల్లో ముంబైలోని కొన్ని మెట్రో స్టేషన్ల పేర్లను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతాలే టార్గెట్
మేయర్ రితూ తావ్డే, BMC కమిషనర్ అశ్విని భిడేకు అందిన ఈ-మెయిల్లో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుపుతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ నివాసమైన జుహులోని జల్సా బంగ్లా, దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ ఈవెంట్ జరగనున్న మహాలక్ష్మి రేస్కోర్స్తో పాటు అచార్య, సైన్స్, మహాలక్ష్మి మెట్రో స్టేషన్లను కూడా ప్రస్తావించినట్లు టాక్.
నవంబర్ 27 నుంచి డిసెంబర్ 31 వరకు మెట్రో స్టేషన్లలో పేలుళ్లు(Mumbai Security Alert) జరుపుతామని, ముంబైలో 30 రోజుల పాటు గ్రెనేడ్ దాడులు చేస్తామని ఈ-మెయిల్లో హెచ్చరించారు. ఈ సందేశంలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల ప్రస్తావన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదోసారి బెదిరింపు కాల్స్
ముంబై మేయర్ కార్యాలయానికి ఈ ఏడాది ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ రావడం ఇది ఐదోసారి. గతంలో జూన్, జూలై, ఆగస్టు, అక్టోబర్ నెలల్లోనూ ఇలాంటి హెచ్చరికలు వచ్చాయి. ప్రతిసారీ పోలీసులు భద్రతా తనిఖీలు చేపట్టారు. అక్టోబర్‌లో వచ్చిన బెదిరింపుల్లోనూ అమితాబ్ బచ్చన్ నివాసం, దిల్జిత్ దోసాంజ్ కాన్సర్ట్ వేదిక పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.ఈఘటనపై పోలీసులు ఈ-మెయిల్ మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. బాంబు డిటెక్షన్ బృందాలు, భద్రతా సిబ్బంది(Mumbai Security Alert) అప్రమత్తమయ్యారు.విదేశీయులు, దౌత్యవేత్తలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారని, భారీ ప్రాణనష్టం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలనేది వారి లక్ష్యమని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ అన్నారు. భారత సైనికులు, పౌరులపై దాడులను దేశం సహించబోదని, బాధ్యులకు తగిన సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు.



