సుప్రియా కీలక వ్యాఖ్యలు.. కాల్పులపై ఆందోళన
Tiger Shroff: బాలీవుడు నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే. దాడి తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ స్టేట్మెంట్ విని తీవ్ర విస్మయం చెందానన్నారు

Supriya Sule : బాలీవుడు నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన రాజకీయ రగడ కొనసాగుతోంది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈదాడికి బాధ్యత వహించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే. దాడి తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ స్టేట్మెంట్ విని తీవ్ర విస్మయం చెందానన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైల్లో ఉంటూ దాడులకు బాధ్యత వహిస్తున్నానని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇలా ఘటనలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు టైగర్ ష్రాఫ్‌పై దాడికి పాల్పడింది తామే అంటూ సోషల్ మీడియాలో ఎలా ప్రకటిస్తారని.. జైల్లో ఉండి ఇలా నేరాలకు బాధ్యత వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తాయని చెప్పారు. జైల్లో అసలు ఏం జరుగుతుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతాయన్నారు.
ఈనెల 18న ముంబైలోని జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈఘటనలో టైగర్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయన కారు డ్రైవర్‌కు
గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయోద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్లు బిష్ణోయ్ ముఠా ప్రకటించింది. సల్మాన్‌తో కలిసి పనిచేసి వారికి ఎవరైనా ఇదే గతి పడుతోందని హెచ్చరించారు. ఈకేసులో అనుమానితులను పోలీసులు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈకేసులో రాధ, బబిత, కునాల్, సుమిత్ అనే మరో నలుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విచారణలో ఈకేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు మరో బాలీవుడ్ సెలబ్రిటీని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపాలని భావించారు. అది కష్టతరమవ్వడంతో వారి ఉనికిని చాటుకోవడం కోసం టైగర్ ష్రాఫ్‌పై దాడులు చేసినట్లు తెలుస్తోంది.



