కాక్రోచ్లకు లుకౌట్ నోటీసులు.. ముగ్గురిపైన చర్యలు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్లు (LOCs) జారీ చేశారు.

CJP Leaders Lookout Circular
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్లు (LOCs) జారీ చేశారు. అక్టోబర్ 2న దాదర్‌లోని శివాజీ పార్క్ వద్ద అనుమతి లేకుండా నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన కేసులో ఈ చర్యలు తీసుకున్నారు. నిందితులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో ముందస్తుగా లుక్ అవుట్ నోటీసులు(CJP Leaders Lookout Circular) జారీ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
ఏఏ కేసులు …!
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తో అక్టోబర్ 2న ‘చలో ముంబై’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘చలో ముంబై’ పేరుతో శివాజీ పార్క్ దగ్గర CJP ఆందోళన చేపట్టింది.శాంతిభద్రతల సమస్యలు, శివాజీ పార్క్ వినియోగానికి సంబంధించిన నిబంధనలను కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.అనుమతి లేకపోయినా 4వేల మందికి పైగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు నిరసనలో పాల్గొని నినాదాలు చేశారు.దీంతో 400 మందికి పైగా మద్దతుదారులపైనా కేసు పెట్టారు ముంబై పోలీసులు.అక్టోబర్ 3న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.BNSసెక్షన్లు 189, 223తో పాటు మహారాష్ట్ర పోలీస్ చట్టంలోని సెక్షన్లు 37, 135లను(CJP Leaders Lookout Circular) ప్రస్తావించారు. సౌరవ్ దాస్‌ను నవంబర్ 23న లండన్ వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణించకుండా అడ్డుకున్నారు.దీంతో విదేశీ పర్యటనకు ఆటంకం కలిగించడాన్ని సవాల్ చేస్తూ సౌరవ్ దాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.సౌరవ్ దాస్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ స్పందనను పరిశీలించేందుకు ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 9కు వాయిదా వేసింది.
డిసెంబర్ 9న తీర్పుపై ఉత్కంఠ..!
సౌరవ్ దాస్ విదేశీ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు లండన్ వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే నవంబర్ 23న ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన ప్రయాణాన్ని అడ్డుకున్నారు.నవంబర్ 26న కేంద్ర హోంశాఖ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఆయన పాస్‌పోర్టులో జన్మస్థలం, విద్యాభ్యాసం, చిరునామా, తల్లిదండ్రుల వివరాలకు సంబంధించి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయని కేంద్రం కోర్టుకు తెలిపింది.సౌరవ్ దాస్ తరఫు న్యాయవాది అఖిల్ సిబల్, LOC (CJP Leaders Lookout Circular)వివరాలు ముందుగా తెలియజేయలేదని, విమానాశ్రయంలో ప్రయాణం ఆపడానికి సంబంధించిన ఉత్తర్వులు చూపలేదని కోర్టులో వాదించారు. మరోవైపు కేంద్రం తన వాదనలు వినిపించింది.ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 9కు నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నేతలపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్లు, సౌరవ్ దాస్ పాస్‌పోర్టు వ్యవహారం, కోర్టులో జరిగే తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.



