ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పురుష ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వివాహిత పురుష ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవు (Paternity Leave) మంజూరు చేస్తూ విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Tamil Nadu Government Employees Good News
ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. ఇప్పటివరకు ప్రసూతి సెలవుల విషయంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు ఉండగా, తాజాగా పురుష ఉద్యోగులకూ పితృత్వ సెలవులు (Paternity Leave) కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భార్య ప్రసవ సమయంలో ఆమెకు అండగా ఉండటంతో పాటు, పుట్టిన బిడ్డ సంరక్షణలో తండ్రి కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో(Tamil Nadu Government Employees Good News) ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించిన ఈ నిర్ణయం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
15రోజుల సెలవులు
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నారు.అయితే ఈసెలవులు బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందు నుంచే పెట్టుకోవచ్చు. బిడ్డ జన్మించిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు వినియోగించుకోవచ్చు.భార్యకు ప్రసవ సమయంలో సహకరించడం, నవజాత శిశువు సంరక్షణలో తండ్రి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా విజయ్ సర్కార్ ఈనిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం వల్ల ప్రసవం తర్వాత తల్లికి అవసరమైన విశ్రాంతి, వైద్య సహాయం అందించడంతో పాటు బిడ్డ సంరక్షణ బాధ్యతలను తండ్రి(Tamil Nadu Government Employees Good News) కూడా పంచుకునే అవకాశం ఉంటుంది.
ఏఏ రాష్ట్రాల్లో అమలు..
తమిళనాడు తీసుకున్న ఈనిర్ణయం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఒడిశా,కేరళ,హిమాచల్ ప్రదేశ్లో అమలులో ఉన్నాయి. అయితే ఒక్క కేరళలో మాత్రమే 10రోజులు మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో 15రోజుల సెలవులు కొనసాగుతున్నాయి.విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అక్కడి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురుష ఉద్యోగులకూ పితృత్వ సెలవులు కల్పించడం కుటుంబ సంక్షేమానికి సంబంధించిన మంచి నిర్ణయం. బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తండ్రి(Tamil Nadu Government Employees Good News) కూడా కుటుంబంతో ఉండే అవకాశం కల్పించడం ద్వారా తల్లిపై ఉండే బాధ్యత కొంత తగ్గుతుంది. ఉద్యోగుల సంక్షేమ విధానాల్లో ఇలాంటి మార్పులు దేశవ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో అమలైతే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.



