Central Govt DA Hike 2026

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం దీపావలి కానుక అనౌన్స్ చేసింది. వారికి ఇచ్చే డీఏ, డీఆర్‌పై పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలో ఉద్యోగులకు అదనపు డీఏ, పెన్షనర్లకు డీఆర్ (Central Govt DA Hike 2026 )విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 60 శాతం బేసిక్ పే, పెన్షన్‌పై అదనంగా 3శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెంచిన డీఏ, డీఆర్ ఉద్యోగులకు 2026 జూలై 1నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. పెరిగిన ధరల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈపెంపుతో మొత్తం డీఏ 63 శాతానికి చేరుకోనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. 68.71 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన 3శాతం డీఏ, డీఆర్‌తో ప్రభుత్వంపై ఏటా రూ. 10,016.10 కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు తెలిపారు.

మరోవైపు 8వ కేంద్ర వేతన సంఘం వేతనాలు, పెన్షన్లకు(Central Govt DA Hike 2026 ) సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రస్తుతం సంప్రదింపులు చేస్తోంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని ఈ కమిషనలో మాజీ ఐఏఎస్‌ అధికారి పంకజ్‌ జైన్‌ , ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు పులక్‌ ఘోష్‌ సభ్యులుగా ఉన్నారు. ఈకమిటీ సిపారస్సులు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపనుంది. వీరిలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాగా.. 65 మంది పెన్షనర్లు ఉన్నారు.

ఉద్యోగులు డీఏ, డీఆర్‌లతో పలు పలు అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర కేబినెట్ చర్చించి.. పలు రంగాల అభివృద్ధికి ఓకే చెప్పింది. అందులో భాగంగానే దేశీయ కంటైనర్‌ తయారీ పరిశ్రమ డవలప్‌మెంట్‌కు చర్యలు చేపట్టింది. ఈరంగం అభివృద్ధికి కోసం రూ. 10వేల కోట్లతో ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. వచ్చే 13ఏళ్ల పాటు ఈ కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకం అమలు కానుంది. మరోవైపు ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని క్రీడా వస్తువుల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఖేలో ఇండియా స్పోర్ట్స్‌ గూడ్స్‌ తయారీ పథకానికి రూ. 1,856 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో దేశంలో 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నాలుగు క్రీడా వస్తువుల తయారీ జోన్లు ఏర్పాటు చేయనుంది. ఇక ప్రధాన మంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐదేళ్లలో రూ. 7, 395 కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా 2.78 లక్షలకు పైగా గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రయోజనం చూకూరేలా నిర్ణయం తీసుకుంది మోదీ కేబినెట్.