కొత్త రూల్స్.. కేంద్రం కీలక నిర్ణయం!
కేంద్రం అగ్నివీర్ జవాన్‌లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కాలపరిమితిని మరో రెండేళ్లు పెంచింది. ఈమేరకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అగ్ని వీర్‌లలో 25శాతం మందిని రెగ్యులర్ సైనికులుగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Agniveer Service Extension
కేంద్రం అగ్నివీర్ జవాన్‌లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కాలపరిమితిని మరో రెండేళ్లు పెంచింది. ఈమేరకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అగ్ని వీర్‌లలో 25శాతం మందిని రెగ్యులర్ సైనికులుగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 75 శాతం మంది అగ్నివీర్‌లకు మరో రెండేళ్ల పాటు సర్వీస్(Agniveer Service Extension ) పొడిగింది. ఈప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై సీడీఎస్ ఎన్‌ఎస్ రాజా సుబ్రమణి అధికారికంగా అనౌన్స్ చేశారు. రెండేళ్ల అదనపు సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా సాయుధ దళాల్లో కొనసాగేందుకు ఆసక్తి చూపే అగ్నివీరులకు నిర్దేశిత ఎంపిక ప్రమాణాల ఆధారంగా రెగ్యులర్ సర్వీసులో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ రగడతో..!
అగ్నిపథ్ పథకం కింద తొలి విడతలో సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో చేరిన సుమారు 24,400 మంది అగ్నివీర్‌లలో 18,300 మంది ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని బయటకు రావాలి. నవంబర్ రెండో వారం నుంచి వారిని దశలవారీగా విడుదల చేయాలి. కాని కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సైన్యంలో విధులు నిర్వహించే అవకాశం వారికి కొనసాగతోంది. 25 శాతం మందిని మాత్రమే మరో 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీసులో(Agniveer Service Extension ) కొనసాగిస్తారు. ఈ విధానంపై గతంలో రాజకీయంగా తీవ్ర చర్చలు జరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
కీలక మార్పులు..!
అగ్నిపథ్ పథకం 2022లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ పథకం కింద సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడుతున్నారు. ఈ గడువు ముగిసిన తర్వాత ప్రతి బ్యాచ్‌లో గరిష్ఠంగా 25 శాతం మందిని ప్రతిభ, సైనిక దళాల అవసరాల ఆధారంగా సాధారణ సర్వీసులో కొనసాగించే అవకాశం ఉంది. మిగిలినవారు విధుల నుంచి వైదొలగాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో వారికి అదనపు సేవా అవకాశం లభించనుంది. నియామక ప్రక్రియలోనూ మార్పులు(Agniveer Service Extension ) ప్రకటించారు. ఇకపై ఫిజికల్ టెస్ట్‌కు ముందుగా ఎగ్జామ్ నిర్వహించనున్నారు. సైన్యంలో పనిచేసిన సమయంలో అగ్నివీరులు పొందిన శిక్షణ, నైపుణ్యాలను గుర్తిస్తూ సర్టిఫికేట్స్ జారీ చేస్తారు.



