MP Chamala Kiran Makes Sensational Remarks Against BRS

రాజకీయా పబ్బం..!
ఎల్‌నినోపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఎల్‌నినోపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తెలుగు పాపులర్‌ టీవీ వేదికగా తీవ్రంగా ఖండించారు. తెలంగాణలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌నినో ఉందన్నారు. ప్రభుత్వంపై చెడు ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ దుర్మార్గమపు ఆలోచనతో ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడలేని ఎల్‌నినో .. కేవలం తెలంగాణలోనే వచ్చినట్లు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. కష్ట సమయంలో ప్రజలను.. రాజకీయాలకు అతీతంగా అలర్ట్ చేయాల్సిందిపోయి.. ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే సంక్షోభంపై ప్రజలను ముందుస్తుగా ప్రిపేర్ చేయాల్సింది పోయి.. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Makes Sensational Remarks Against BRS) ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కుట్ర..!
తెలంగాణ ప్రజల పట్ల బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. మనకు ఓట్లు వేయని ప్రజలను తప్పుదోవ పట్టించి .. వారితో పంటలను వేయించి ప్రభుత్వాన్ని బధ్నాంచేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అసలు ఈరోజు తెలంగాణలో కరెంట్ కష్టాలు రావాడానికి అసలు కారణం బీఆర్ఎస్ అన్నారు. వారి తొమ్మదిన్నరేళ్ల దౌర్భాగ్యపు పాలన వల్లే సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయలేక పోతుందన్నారు. వాళ్లు కట్టిన కాలేశ్వరం కూలేశ్వరం కావడం వల్లే గోదావరి నీళ్లను భద్రపరుచుకోలేక పోయామన్నారు. ఇవాళ ప్రజలు పడుతన్న కష్టాలకు బీఆర్ఎస్సే కారణం అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కమీషన్ల కోసం కక్కుర్తిపడి అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. భవిష్యత్తు తరాలను దృష్టిపెట్టుకోకుండా .. నీళ్లు, నిధులు, నియామకాలను తుంగలోకి తొక్కారని ఫైర్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విపత్తును బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చామల(MP Chamala Kiran Makes Sensational Remarks Against BRS) అన్నారు.

ఎన్నికే సరిగా లేదు..!
SIRకు వ్యతిరేకంగా.. తాము ఢిల్లీలో నిర్వహించిన మాక్ పార్లమెంట్‌లో ఓట్లు కోల్పోయిన వారు వచ్చి స్వచ్ఛంగా మాట్లాడారని చెప్పారు. ఉపాధి కోసం వలసలకు పోయినవారికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా ఎన్నికల సంఘం చేసిందన్నారు ఎంపీ చామల. SIRను అడ్డుపెట్టుకుని జ్ఞానేష్ కుమార్‌ను అక్రమంగా అపాయింట్ చేశారన్నారు. అసలు జ్ఞానేష్ కుమార్‌ అపాయింట్‌మెంటే రాంగ్‌ అన్నారు. జ్ఞానేష్ కుమార్‌ ఎన్నిక విషంలో చీఫ్‌ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓటు లేకుండా .. మోడీ కేబినెట్‌లోని మంత్రి ఓటు ఉపయోగించుకుని ఆయనను ఎన్నుకున్నారన్నారు. ఓట్లు దొంగతనం చేయాలనే ఆలోచనతోనే జ్ఞానేష్ కుమార్‌ ఎంపికలో బీజేపీ రెండు ఓట్లు వాడుకుందని ఆరోపించారు. ప్రతీ సంవత్సరం రెండున్నర కోట్ల కొత్త ఓటర్లు వస్తున్నప్పుడు.. అసలు పదమూడున్న కోట్ల ఓట్లు ఎలా తొలగిపోతాయని ఎంపీ చామల (MP Chamala Kiran Makes Sensational Remarks Against BRS) ప్రశ్నించారు. ఒక్క తెలంగాణలోనే 30 శాతం ఓట్లు మాయం చేశారన్నారు. అధికారంలో 50ఏళ్లు ఉండాలనే కాంక్షతో.. ఏ పార్టీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో.. ఏ వర్గం వ్యతిరేకిస్తే ఆవర్గం ఓట్లు తొలగిస్తున్నారని మోదీ, అమిత్‌షాపై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.