బాలీవుడ్‌కి కొత్త టెన్షన్.. వరుస దాడులతో హడల్
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వింటేనే చాలు బాలీవుడ్ హడలెత్తిపోతోంది. వరుసగా బాలీవుడ్ నటులపై దాడులు చేయడం.. అక్కడ తామే కారణమంటూ బిష్ణోయ్ గ్యాంగ్ బ్రాండ్ వేసుకోవడం చూస్తే కలవరపాటుకు గురిచేస్తోంది. నిజంగానే బాలీవుడ్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ భయపెడుతోందా?.

Bishnoi Gang Threats to Bollywood Actors
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వింటేనే చాలు బాలీవుడ్ హడలెత్తిపోతోంది. వరుసగా బాలీవుడ్ నటులపై దాడులు చేయడం.. అక్కడ తామే కారణమంటూ బిష్ణోయ్ గ్యాంగ్ బ్రాండ్ వేసుకోవడం చూస్తే కలవరపాటుకు గురిచేస్తోంది. నిజంగానే బాలీవుడ్‌ను బిష్ణోయ్ గ్యాంగ్( Bishnoi Gang Threats to Bollywood Actors) భయపెడుతోందా? ఒకరి తర్వాత ఒకరుగా సినీ ప్రముఖులే టార్గెట్‌గా మారుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆమధ్య రోహిత్ శెట్టి ఇంటి దగ్గర కాల్పులు.. ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్ టార్గెట్‌గా ఈగ్యాంగ్ ముంబైలో కాల్పులకు తెగబడింది. తాజాగా బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపు కాల్స్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. వరుస ఘటనలతో బాలీవుడ్లో ఆందోళన నెలకొంది.
ఫేక్ కాల్..!
తాజాగా బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపు కాల్స్ రావడం ముంబైలో కలకలం రేపింది. తాను బిష్ణోయ్ గ్యాంగ్‌లోని హ్యారీ బాక్సర్‌ని.. రూ.5 కోట్లు ఇవ్వాలని .. బెదిరించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైమ్ బ్రాంచ్, టెక్నికల్ టీమ్, బెదిరింపు కాల్ ఆడియో రికార్డింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. వారి దగ్గర ఇంతకుముందు ఉన్న హ్యారీ బాక్సర్ అసలు వాయిస్ శాంపిల్స్‌తో మ్యాచ్ చేసి చూసింది. హ్యరీ బ్యాక్సర్ అసలు వాయిస్‌తో .. ఇప్పుడు వచ్చిన బెదిరింపు కాల్ వాయిస్ ఎలాంటి పోలిక కుదరలేదని పోలీసులు తెలిపారు. ఇతర ఆడియో శాంపిల్స్‌తో పోల్చినా ఫలితం లేకపోవడంతో ఫేక్ కాల్‌గా నిర్థారించారు. బిష్ణోయ్ గ్యాంగ్( Bishnoi Gang Threats to Bollywood Actors) పేరు చెప్పి నటుడిని భయపెట్టి డబ్బు గుంజడానికి ఎవరో ప్రయత్నించి ఉండవచ్చని ఇది ఫేక్ కాల్ అయి ఉండవచ్చని అనుమానిస్తోంది. కాలర్ వాయిస్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బాలీవుడ్లో భయాందోళనలు సృష్టించి, సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు ఈ గ్యాంగ్ పేరును వాడుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
భద్రత పెంపు
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కు కూడా బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆయన సిబ్బందిలోని ఓ వ్యక్తికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా రూ.10 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో బిష్ణోయ్ గ్యాంగ్( Bishnoi Gang Threats to Bollywood Actors) కు సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వరుస కాల్పులు, బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు సినీ ప్రముఖుల భద్రతపైప్రత్యేక దృష్టి సారించారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రోహిత్ శెట్టి నివాసాల వద్ద భద్రతను పెంచారు. మరోవైపు గ్యాంగ్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
సల్మాన్‌పై గురి
బిష్ణోయ్ గ్యాంగ్‌కు, సల్మాన్ ఖాన్‌కు మధ్య వివాదం 1998లో జరిగిన కృష్ణజింకల వేట కేసు నుంచి మొదలైంది. కృష్ణజింకలకు బిష్ణోయ్ సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో సల్మాన్‌పై లారెన్స్ బిష్ణోయ్( Bishnoi Gang Threats to Bollywood Actors) పలుమార్లు బహిరంగంగా హెచ్చరికలు చేసింది. 2024 ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్స్ వెలుపల ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


