బిహార్ మాజీ ఎంపీకి షాక్.. నెలలోపు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం
బిహర్ మాజీ ఎంపీ ఆనంత్ మోహన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. 1994లో గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్య హత్య కేసులో ఆయనకు లభించిన ముందస్తు విడుదలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆనంద్ మోహన్ ఒక నెలలోపు లొంగిపోయి, తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.

Anand Mohan Supreme Court Verdict
శివహర్ (Sheohar) లోక్‌సభ నియోజకవర్గం మాజీ ఎంపీ ఆనంత్ మోహన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. 1994లో గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి. కృష్ణయ్య హత్య కేసులో ఆయనకు లభించిన ముందస్తు విడుదలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.బిహార్ ప్రభుత్వం 2023లో తన శిక్షా తగ్గింపు (రెమిషన్) నిబంధనలకు చేసిన సవరణ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఆనంద్ మోహన్ ఒక నెలలోపు లొంగిపోయి, తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. 1994లో ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను ఒక గుంపు దారుణంగా హత్య చేసిన కేసులో ఆనంద్ మోహన్ దోషిగా (Anand Mohan Supreme Court Verdict)తేలారు. జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.బిహార్ జైలు నిబంధనలలో మార్పులు రావడంతో, 2023 ఏప్రిల్‌లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు.
అసలు కేసేందుకు?
1994 ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్య కేసులో బిహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బిహార్ ప్రభుత్వం 2023లో కల్పించిన ముందస్తు విడుదల (Premature Release) ప్రయోజనాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. నెల రోజుల్లోగా సంబంధిత జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 26, గురువారం ఈ కీలక తీర్పు వెలువరించింది. ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం చేసిన బిహార్ ప్రభుత్వ 2023 జైలు నిబంధనల సవరణ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే చట్టబద్ధమైన విధానాన్ని అనుసరిస్తూ ప్రభుత్వం భవిష్యత్తులో మళ్లీ శిక్ష తగ్గింపు ప్రక్రియను చేపట్టవచ్చని కూడా పేర్కొంది. దీంతో మూడేళ్ల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన ఆనంద్ మోహన్ (Anand Mohan Supreme Court Verdict)మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లొంగిపోకపోతే అరెస్ట్ చేయండి
1994 డిసెంబర్లో అప్పటి గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్, ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను బిహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రాంతంలో ఒక గుంపు దాడి చేసి హత్య చేసింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఆనంద్ మోహన్ ఈ ఘటనలో గుంపును రెచ్చగొట్టారనే అభియోగాలపై దోషిగా తేలారు.ఈ కేసులో 2007లో తొలుత మరణశిక్ష విధించగా, 2008లో పాట్నా హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది. 2012 జూలైలో సుప్రీంకోర్టు కూడా జీవిత ఖైదు తీర్పును సమర్థించింది. అయితే 2023లో బిహార్ ప్రభుత్వం జైలు మాన్యువల్‌లో మార్పులు చేయడంతో ఆయనకు ముందస్తు విడుదలకు అవకాశం ఏర్పడింది. అదే ఏడాది ఏప్రిల్ 27న సాహర్సా జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జీవిత ఖైదు పడిన వ్యక్తికి కేవలం 14 ఏళ్ల జైలు జీవితం పూర్తయిందనే కారణంతో ముందస్తు విడుదల కల్పించడం సరికాదని ఆమె తన పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.ఆనంద్ మోహన్‌కు(Anand Mohan Supreme Court Verdict) ముందస్తు విడుదల కల్పిస్తూ 2023 ఏప్రిల్ 24న ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసింది. నెల రోజుల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. లొంగిపోకపోతే సంబంధిత అధికారులు ఆయనను తిరిగి అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.



