Stock Market Today

కొనుగోళ్లతో షంషేర్‌ లా పుంజుకుంది అనుకున్న స్టాక్‌ మార్కెట్‌.. ఆ ఊపును కొనసాగించలేకపోయాయి. ప్రారంభం పర్వాలేదన్పించింది. కానీ ఆ తరువాత రాను రాను బుల్‌ తుస్సుమంది. ఎట్టకేలకు ఫ్రైడే మరీ డ్రై డే అనకుండా చివరాఖరకు సెన్సెక్స్‌ 308 పాయింట్లు ప్రాఫిట్‌ గెయిన్‌ తో కాస్తో కూస్తోరిలీఫ్‌ను ఇచ్చింది. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 74,199 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 74,742కు ఎగబాకి.. చివరకు 74,466 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 116పాయింట్ల లాభంతో 23వేల పాయింట్ల వద్ద ముగిసింది. షరా మాములగానే క్రూడాయిల్‌ ధరలపై వున్న ఆందోళన మార్కెట్‌పై ఎఫెక్ట్‌ చూపింది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధరకు 117 డాలర్లకు చేరింది. అందుకు కారణం అమెరికాలో మధ్యంతర ఎన్నికలవ్వగానే ఇరాన్‌పై దాడి తప్పదన్న ట్రంప్‌ వ్యాఖ్యలే అనేది ఎక్స్‌ పర్ట్స్‌ మాట. స్టాక్‌ మార్కెట్‌(Stock Market Today) కథ అలా వుంటే .. ఇక పండగ వేళ కళకళలాడాల్సిన గోల్డ్‌ బిజినెస్‌కు కళ తగ్గడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క నెలలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర మూడున్నర శాతం తగ్గింది. అదే బాటలో వెండి ధర 14 శాతంపైగా పడిపోయింది. అమెరికా డాలర్‌ విలువ పెరగడం .. గోల్డ్‌ పై ఇన్వెస్ట్‌ చేయడం అంత గిట్టుబాటు కాదన్న అభిప్రాయం వెరసి బంగారం , వెండి ధరలు తగ్గు ముఖం పడుతున్నాయంటున్నారు నిపుణులు. నిఫ్టీ సూచీలో ట్రెంట్‌, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు రాణించగా.. శ్రీరామ్ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, నెస్లే, ఎంఅండ్‌ఎం స్టాక్స్‌(Stock Market Today) నష్టపోయాయి.