Gold Price Forecast

బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది కొంత మంచి సమయమే అని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోతున్న నిర్ణయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం (నవంబర్ 16) దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు(Gold Price Forecast) దిగివచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై గరిష్టంగా రూ.820 వరకు తగ్గుదల నమోదైంది. వెండి ధరలు సైతం భారీగా పడిపోతున్నాయి. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది.

గోల్డ్, సిల్వర్ రేటు తగ్గడానికి కారణాలు..!
సోమవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ ధర 1.37 శాతం (రూ.1,877) తగ్గి 10 గ్రాములకు రూ.1,34,828కు చేరింది. మరోవైపు వెండి ధర మరింత భారీగా పడిపోయింది. డిసెంబర్ డెలివరీ సిల్వర్ ధర కిలోకు రూ.6,567 (2.19 శాతం) తగ్గి రూ.1,69,742 వద్ద ట్రేడైంది. గోల్డ్, సిల్వర్ తగ్గులకు ప్రధాన కారణాలు పరిశీలిస్తే.. బంగారానికి స్పాట్ మార్కెట్లో డిమాండ్ (Gold Price Forecast)తగ్గింది. ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలకు దిగుతున్నారు. వెండి మార్కెట్లో విక్రయాల ఒత్తిడి పెరుగుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పతనమవుతోంది. బంగారం ఫ్యూచర్స్ ధర 0.64 శాతం తగ్గి ఔన్స్‌కు 3,861.35 డాలర్లకు చేరింది. వెండి ధర 3.59 శాతం పడిపోయి ఔన్స్‌కు 47.36 డాలర్లకు తగ్గింది. మొత్తంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనమైన డిమాండ్, అమ్మకాల ఒత్తిడి కారణంగా బంగారం కంటే వెండి ధరలు ఎక్కువగా పడిపోయాయి. దీంతో పసిడి, వెండి కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.

బంగారం ధరలు ఎలా ఉన్నాయి!
నవంబర్ 16, సోమవారం నాటి గుడ్ రిటర్న్స్ ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price Forecast) ధర హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో రూ.1,36,800 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల ధర రూ.1,25,400గా ఉంది. ఢిల్లీలో మాత్రం స్థానిక ధరల వ్యత్యాసంతో కొంత ఎక్కువగా నమోదైంది.

అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేసే కీలక అంశాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఒకటి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలపై చర్చ జరుగుతోంది. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల వంటి పెట్టుబడులపై రాబడి పెరుగుతుంది. బంగారంపై(Gold Price Forecast) మాత్రం ఎలాంటి వడ్డీ లభించదు. దీంతో కొంతమంది పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర పెట్టుబడుల వైపు మళ్లుతారు. ఫలితంగా పసిడిపై ఒత్తిడి పెరుగుతుంది.

2. అమెరికా డాలర్ బలపడటం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సాధారణంగా అమెరికన్ డాలర్లలో నిర్ణయిస్తారు. డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేయడం ఖరీదవుతుంది. ప్రస్తుతం డాలర్(Gold Price Forecast) బలపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా మారింది. అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా పసిడికి ప్రతికూలంగా మారుతోంది.

3. ద్రవ్యోల్బణ భయాలు
అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఫెడ్ మరింత కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరించవచ్చనే అంచనాలు పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారంపై(Gold Price Forecast) తమ పెట్టుబడులను తగ్గిస్తున్నారు.

4. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి
ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. అంతేకాకుండా ధరలు మరింత తగ్గుతాయనే అంచనాలతో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ పరిణామాలన్నీ కలిసి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం(Gold Price Forecast) ధరలను దిగజారుస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి ఏంటి?
అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 3,830 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ఇది 2025 అక్టోబర్ తర్వాత నమోదైన కనిష్ట స్థాయి ఇది. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ పసిడిపై(Gold Price Forecast) అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అమెరికాలో డిసెంబర్ నెలలో వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చనే అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్ అంచనాల ప్రకారం 25 బేసిస్ పాయింట్ల పెంపునకు 91 శాతం, 50 బేసిస్ పాయింట్ల పెంపునకు 9 శాతం అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఎంతకాలం తగ్గుతాయి?
ఇదే ఇప్పుడు సామాన్య కొనుగోలుదారులను ఎక్కువగా ఆలోచింపజేస్తున్న ప్రశ్న. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను పరిశీలిస్తే సమీప కాలంలో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలపై మరింత ఒత్తిడి ఏర్పడవచ్చు. డాలర్ మరింత బలపడితే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుంది. బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కొనసాగితే బంగారం(Gold Price Forecast)లో పెట్టుబడుల ఆకర్షణ తగ్గవచ్చు. మరోవైపు అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగినా, ఆర్థిక అనిశ్చితి ఏర్పడినా బంగారానికి మళ్లీ డిమాండ్ పెరగవచ్చు. అందువల్ల బంగారం ధరలు ఎప్పటి వరకు తగ్గుతాయో కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ముఖ్యంగా అమెరికా ఫెడ్ తదుపరి నిర్ణయం వెలువడే వరకు మార్కెట్లో అస్థిరత ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

భవిష్యత్తులో పరిస్థితి ఏంటీ?
ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ దీర్ఘకాలంలో బంగారం మార్కెట్ పూర్తిగా బలహీనపడిందని చెప్పలేం. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని (Gold Price Forecast)కొనుగోలు చేయడం, గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడికి మద్దతుగా నిలుస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నవంబర్ 3న విడుదల చేసిన 2026 మూడో త్రైమాసిక నివేదిక ప్రకారం ఈ ఏడాది పెట్టుబడి రూపంలో బంగారానికి డిమాండ్ బలంగా ఉండే అవకాశం ఉంది. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను కొనసాగించే అవకాశముందని అంచనా వేసింది. అయితే అధిక వడ్డీ రేట్లు, బలమైన డాలర్, పెరిగిన బాండ్ ఈల్డ్స్ బంగారం ధరలకు ప్రతికూలంగా మారవచ్చని అదే నివేదిక స్పష్టం చేసింది.