అమూల్ పాల రేటు పెంపు.. కొత్త ధరలు అమలు!
నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు పాల కంపెనీలు మరో షాక్ ఇచ్చాయి. ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ .. పాల ధరలను పెంచింది. నవంబర్ 12 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

Amul Milk Price Hike
అసలే ఎల్‌నినోతో ఇప్పటికే బియ్యం, పప్పు ధరలు అకాశాన్నంటాయి. వర్షాలు లేక కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు పాల కంపెనీలు మరో షాక్ ఇచ్చాయి. ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ .. పాల ధరలను పెంచింది. లీటరు పాలపై రూ.2 నుంచి రూ.4 వరకు ధర పెంచింది. నవంబర్ 12 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అమూల్(Amul Milk Price Hike ) తాజా, గోల్డ్ సహా పలు రకాల ప్యాకెట్ పాల ధరల్లో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో నిత్యం పాలు కొనుగోలు చేసే వినియోగదారుల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది.
ఎంత పెరిగిందంటే..
అమూల్ కొత్త ధరల ప్రకారం టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.2 పెరిగి రూ.62కు చేరింది. ఫుల్ క్రీమ్ మిల్క్ గోల్డ్ లీటరుకు రూ.4 పెరిగి రూ.80కి చేరింది. అమూల్ శక్తి, టీ స్పెషల్ వంటి ఇతర వేరియంట్లపైనా ధరల సవరణ ప్రభావం పడింది. ముడి సరుకులు, పశువుల దాణా, ప్యాకేజింగ్ మెటీరియల్, ఇంధనం, ప్రాసెసింగ్ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) వెల్లడించింది. పాల ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో అధిక భాగాన్ని పాలు సరఫరా చేసే రైతులకు అందించనున్నట్లు అమూల్(Amul Milk Price Hike ) తెలిపింది. పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ప్రతిఫలం కల్పించడంతోపాటు పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను భర్తీ చేసేందుకే ధరలను సవరించినట్లు పేర్కొంది. మే 2026 తర్వాత అమూల్ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి. మరోవైపు, ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాలు పెరిగాయనే కారణంతో మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచినట్లు వార్తలు వెలువడ్డాయి.
అన్ని కంపెనీలు అదే తీరు
దేశంలోని పలు ప్రముఖ డెయిరీ సంస్థలు ఇటీవల కాలంలో పాల ధరలను పెంచుతూ పోతున్నాయి. తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలను అర లీటర్ స్టాండర్డైజ్డ్ పాల ధరను 34 రూపాయల నుంచి 35 రూపాయలకు, హోల్ మిల్క్ ధరను 39 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచింది. ఇక కర్ణాటకలో నందిని డెయిరీ లీటరు పాలపై 8 రూపాయలు, పెరుగుపై 14 రూపాయలు పెంచింది. మదర్ డెయిరీ సైతం లీటరు పాలపై 2 నుంచి 4 రూపాయల వరకు ధరలు పెంచగా, అమూల్(Amul Milk Price Hike ) కూడా తన తాజా పాలపై 2 రూపాయలు, గోల్డ్ పాలపై 4 రూపాయలు పెంచింది. ఇలా ఒక్కొక్కటిగా ప్రముఖ డెయిరీ కంపెనీలు పాల ధరలను పెంచుతుండటంతో సామాన్యుల నెలవారీ కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పాల ధరల పెంపు మరింత భారంగా మారింది.
ચાની ચુસકી પણ હવે મોંઘી પડશે! ☕😂
દૂધના ભાવમાં અમૂલનો વધુ એક ઝટકો. ગોલ્ડ ₹70માંથી ₹74 અને તાજા પણ મોંઘા!
દૂધમાં વિકાસ, ખિસ્સામાં ઘટાડો. હવે ચાની મજા પણ મોંઘી પડશે!
#Amul | #MilkPriceHike | @Amul_Coop https://t.co/a4Zgb96wzD
— HIMANSHU PARMAR (@himanshu_171120) November 11, 2026



