ఎన్విడియా సీఈవో కీలక నిర్ణయం.. రాజీనామాతో ఎండ్ కార్డు
ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. జెన్సన్ పదవి నుంచి వైదొలగాలనే డిమాండ్లు రావడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Jensen Huang Resigns
ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ పదవి హుస్ కాకి అయింది. సంస్థలో పనిచేసే మహిళతో సంబంధాల విషయం వివాదాస్పదమైంది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ హువాంగ్‌తో జెన్సన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆవిషయాన్ని ఆయన ఇటీవల స్వయంగా వెల్లడించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. జెన్సన్ పదవి నుంచి వైదొలగాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రజెంట్ జాతీయ భద్రతపై ఆందోళనలు రేకెత్తించడంతో ఎన్విడియా సీఈవో పదవికి తాను రాజీనామా (Jensen Huang Resigns)చేస్తున్నట్లు జెన్సన్ ప్రకటించారు. జెన్సన్ రాజీనామాతో తాత్కాలిక సీఈవోగా కొలెట్ క్రెస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈవిషయాన్ని ఎన్విడియా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎన్విడియా షేర్లు ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 10 శాతం పతనం అయ్యాయి.
BREAKING: Nvidia stock, $NVDA, plunges over -10% after Jensen Huang officially resigns as CEO.
The stock has now erased -$750 billion in market cap since the scandal began. https://t.co/PpPv6JDk7o
— Sam_Ette is king👑 (@samloves_books) November 12, 2026
జెన్సన్ హువాంగ్.. తన మేధస్సుతో ఎన్విడియా సంస్థను ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. ప్రపంచంలోని కంప్యూటర్లలో 70 శాతానికి పైగా సెమీకండక్టర్లు, ప్రాసెసర్లు ఎన్విడియావే ఉపయోగిస్తున్నారని పేర్కొంటున్నారు. అలాంటి సంస్థకు 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్ సీఈవోగా (Jensen Huang Resigns)వ్యవహరిస్తున్నారు. అయితే ఎంతటి మగాడైనా ఆడదాని అందానికి దాసుడే అన్నట్లు.. ఇప్పుడు ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ఇద్దరు మహిళలతో సంబంధాలు కొనసాగించడం ఆ సంస్థను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఒకరు అమెరికాకు ప్రత్యర్థి దేశమైన చైనాకు చెందిన అలిస్ హువాంగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఇప్పుడు కింబర్లీ పోవెల్‌తోనూ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆయన పదవికి ఎసరు తెచ్చింది.



