Omar Abdullah Second Marriage

జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా మరో వివాహం చేసుకున్నారు. జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను వివాహమాడినట్లు స్వయంగా సీఎం ప్రకటించారు. ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటోలుల సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్‌ 30న కుటుంబ సభ్యుల మధ్య వివాహం(Omar Abdullah Second Marriage) జరిగినట్లు చెప్పారు. తాను మరో కొత్త జీవితం మొదలు పెట్టినట్లు పోస్టులో తెలిపారు. స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ కింద వీరి వాహం జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, శ్రీనగర్‌లో జరిగిన వివాహ వేడుకలకు ఒమర్ తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, తల్లి మోలీ అబ్దుల్లా, ఆయన సోదరీమణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిధి తల్లిదండ్రులు, ప్రముఖ జర్నలిస్ట్ ఎం.కె. రాజ్‌దాన్, సరళ రాజ్‌దాన్ కూడా హాజరయ్యారు.

మొదటి భార్యతో విడాకులు
అయితే ఒమర్ అబ్దుల్లాకు గతంలో పెళ్లి అయింది. 1994లో పాయల్‌లను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే పాయల్ ,ఒమర్ అబ్ధుల్లా మధ్య మనస్పర్ధల కారణంగా 2011లో విడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే ఫస్ట్ కుటుంబ కోర్టు, ఆతర్వాత ఢిల్లీ హైకోర్టు ఒమర్, పాయల్ విడాకుల పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటీషన్‌ను విచారించిన కోర్టు.. ఇరువురు దాదాపుగా 15ఏళ్లుగా విడిగా జీవిస్తున్నారు కనుక.. విడాకుల మంజూరుకు అనుమతి ఇచ్చింది. 2026 జూలై 31న సుప్రీంకోర్టు వీరి వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురి మధ్య మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదరడంతో పరస్పర అంగీకారంతో విడాకులుమంజూరయ్యాయి. సుప్రీం తీర్పు తర్వాత మూడు నెలలకే ఒమర్‌ అబ్దుల్లా మరో వివాహం(Omar Abdullah Second Marriage) చేసుకున్నారు.

ఎవరీ నిధి రాజ్దాన్?
జమ్ముకశ్మీర్ సీఎం మనువాడిని జర్నలిస్ట్ నిధి రజ్ధాన్ ప్రముఖ టెలివిజన్ జర్నలిస్ట్. ఆమె చాలా కాలం NDTVలో పనిచేశారు. జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన అంశాలపై వార్తా కథనాలు, చర్చా కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. ప్రస్తుతం 56 ఏళ్ల ఒమర్ అబ్దుల్లా, 49 ఏళ్ల నిధి రాజ్‌దాన్ ఇద్దరికీ ఇది రెండో వివాహమే. నిధి కూడా గతంలో వివాహం చేసుకున్నారు. ఆయనతో విడిపో.. ఇప్పుడు ఏకంగా జమ్ము కశ్మీర్ సీఎంనే వివాహమాడారు(Omar Abdullah Second Marriage). అయితే వీరిద్దరి వివాహం ఇప్పుడు చాలా హాట్‌టాపిక్ అయింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు నిధి రాజ్‌దాన్ కూడా మీడియా రంగంలో ప్రముఖ వ్యక్తి కావడంతో ఈ వివాహంపై ఆసక్తి నెలకొంది.