నేషనల్ కాన్ఫరెన్స్‌కు భారీ షాక్.. 24 ఏళ్ల బంధానికి గుడ్‌బై!
జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహ్దీ నేషనల్ కాన్ఫరెన్స్ రాజీనామా చేశారు.

Aga Syed Ruhullah Mehdi Resigns
జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహ్దీ నేషనల్ కాన్ఫరెన్స్ రాజీనామా(Aga Syed Ruhullah Mehdi Resigns) చేశారు. దాదాపు 24 ఏళ్లుగా కొనసాగుతున్న అనుబంధానికి తెరదించారు. పార్టీ సభ్యత్వానికి కూడా గుడ్‌బై చెప్పారు. బుడ్గామ్‌లో జరిగిన తన తండ్రి 26వ వర్ధంతి కార్యక్రమంలో రుహుల్లా మెహ్దీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 24 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతూ రుహుల్లా మెహ్దీ తీసుకున్న నిర్ణయం జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రజలను మోసం చేయలేను..
తన రాజీనామాకు గల కారణాలను వివరించారు శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహ్దీ. నాలుగు పేజీల లేఖ విడుదల చేశారు. 2024 ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పార్టీ వమ్ము చేసిందని ఆరోపించారు. ఎన్నికల తర్వాత పార్టీ తన వైఖరిని మార్చుకుందని విమర్శించారు. ముఖ్యంగా ఆర్టికల్ 370, 35ఏ రద్దు కశ్మీరీల హక్కులపై దాడి అని మెహ్దీ అన్నారు. ఈ హక్కుల పునరుద్ధరణ కోసం పోరాటానికి నాయకత్వం వహిస్తామని పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ నమ్మకంతోనే తాను నేషనల్ కాన్ఫరెన్స్‌కు (Aga Syed Ruhullah Mehdi Resigns) మద్దతుగా నిలిచానని తెలిపారు.
త్వరలో నిర్ణయం..!
అయితే ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. పార్టీలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని మెహ్దీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లపాటు పార్టీలో పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. అవమానాలు భరిస్తూ.. ఓటువేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ నేషనల్ కాన్పరెన్స్‌లో ఇకపై కొనసాగలేనని స్పష్టం చేశారు. అందుకే రాజీనామా(Aga Syed Ruhullah Mehdi Resigns) చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరో మార్గంలో ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి మరో రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని ఆయన సన్నిహితులు చెప్పారు.
.



