గోరింటాకు ముద్దు.. మెహందీ వద్దు
భారతీయ సాంప్రదాయంలో పెళ్లీలు, పండగలు, పంక్షలు వస్తున్నాయంటే మహిళలు అందంగా ముస్తాబవుతారు. ఒకరోజు ముందుగానే చేతులకు గోరింటాకు పెట్టుకుని రెడీగా ఉంటారు. గోరింటాకు పెట్టుకుని సిద్దమవడం అనాదిగా వస్తున్న ఆచారం. గత కొన్నేళ్లుగా ఆ ఆచారం గతి తప్పుతోంది. గోరింటాకు బదులుగా రసాయనాలతో కూడిన మెహందీ కోన్లు పెట్టుకోవడం వల్ల చర్మవాధ్యులకు గురవుతున్నారు.

Mehndi Cone Side Effects
భారతీయ సాంప్రదాయంలో పెళ్లీలు, పండగలు, పంక్షలు వస్తున్నాయంటే మహిళలు అందంగా ముస్తాబవుతారు. ఒకరోజు ముందుగానే చేతులకు గోరింటాకు పెట్టుకుని రెడీగా ఉంటారు. గోరింటాకు పెట్టుకుని సిద్దమవడం అనాదిగా వస్తున్న ఆచారం. గత కొన్నేళ్లుగా ఆ ఆచారం గతి తప్పుతోంది. గోరింటాకు బదులుగా రసాయనాలతో కూడిన మెహందీ కోన్లు పెట్టుకోవడం వైపు మొగ్గుచూపుతున్నారు మహిళలు. అయితే ఈమెహందీ(Mehndi Cone Side Effects) పెట్టుకోవడం వల్ల ప్రయోజనం కన్నా.. దుష్ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. మెహందీ పెట్టుకున్న కొద్దిసేపటికే మహిళల చేతుల్లో విపరీతమైన మంట, దురద, వాపు లేదా చర్మం ఎర్రబడటం వంటి ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన కోన్ల వల్ల చర్మం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈప్రమాదాలకు కారణం నల్లటి గోరింటాకు లేదా బ్లాక్ హెన్నా ఉత్పత్తులలో కలిపే కొన్ని ప్రమాదకరమైన రసాయనాలేనని నిపుణులు చెప్తున్నారు. సహజసిద్ధమైన గోరింటాకులతో రుబ్బిన మెహందీ పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు. అంతేకాని త్వరగా ఎర్రగా కనిపించేలా ఉండేందుకు అందులో కలిపే పారాఫెనిలెనెడియమైన్ అనే రసాయనం వల్ల చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. లేత చర్మం కలిగి ఉన్నవారికి లేదా ముందే చర్మ సమస్యలు ఉన్నవారికి ఈ రసాయనాల కోన్లు పెడితే తద్వారా అలర్జీలు త్వరగా సోకే అవకాశం ఉంటుందని చర్మ వ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతికూల సమయాల్లో ఎలాం ఉండాలో కూడా డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. చేతులపై మంట లేదా దురద అనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా గోరువెచ్చని లేదా సాధారణ నీటితో ఆ ప్రాంతాన్ని మెత్తగా కడిగేయడం వల్ల కొంత ప్రయోజనం చేకూరుతుందని చెప్తున్నారు. అంతేకాని రంగు బాగా పండాలనే ఉద్దేశంతో మంటగా ఉన్నా భరిస్తూనే ఎక్కువసేపు మెహందీ(Mehndi Cone Side Effects)ని చేతిపై ఉంచుకోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందన్నారు. అలాగే దురదగా ఉందని చేతులతో గట్టిగా రఫ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తుందని చెప్పారు. తర్వాత పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరీ ముఖ్యంగా అలర్జీ బారిన పడిన వారు ఆ ప్రాంతంలో ఎలాంటి సబ్బులు, పర్ఫ్యూమ్స్ లేదా బాడీ స్క్రబ్స్‌ను ఉపయోగించకూడదని (Mehndi Cone Side Effects)సూచిస్తున్నారు. మరికొందరైతే మంటగా ఉందని కదాఅని సొంత ప్రయోగాలు చేస్తారు. నిమ్మరసం, బేకింగ్ సోడా లేదా టూత్‌పేస్ట్ వంటి పదార్థాలను రాస్తుంటారు, దీనివల్ల చర్మం మరింతగా కందిపోయి సమస్య తీవ్రమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దానికంటే కూడా శుభ్రమైన వస్త్రాన్ని చల్లటి నీటిలో ముంచి, అలర్జీ ఉన్న చోట సున్నితంగా కాపడం పెడితే తక్షణ ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక చర్మంపై నీటి బొబ్బలు రావడం, భరించలేని రీతిలో నొప్పి ఉండటం, వాపు పెరగడం లేదా చేతులు ఎర్రగా మారడం లాంటివి గమనిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని.. వారు రాసే ప్రిస్కిప్షన్ వాడాలని సూచిస్తున్నారు.



