Karbonn Smartphone Comeback

కార్బన్ బ్రాండ్ మరోసారి స్మార్ట్ ఫోన్‌ రంగంలోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తోంది. ఒకప్పుడు బడ్జెట్ ఫోన్‌లతో మార్కెట్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భారతీయ కంపెనీ.. ఈసారీ పూర్తిగా రూట్‌ మార్చేసింది. ప్రజెంట్ మార్కెట్‌ పల్స్‌ను పట్టేసింది. ప్రజెంట్ జెన్‌జీ యుగం నడుస్తోంది కనుక .. వారే టార్గెట్‌గా మార్కెట్‌లోకి (Karbonn Smartphone Comeback) తిరిగి అడుగుపెడుతోంది. స్మార్ట్ ఫ్యూచర్లు, స్మార్ట్‌ ప్రైస్‌తో మార్కెట్‌లోకి రీఎంట్రీకి సిద్దమైంది. ఒకప్పటి షావోమీ లాజిక్‌ను అప్లై చేస్తోంది. జెన్‌జీ, కంటెంట్‌ క్రియేటర్లే టార్గెట్‌గా న్యూ స్మార్ట్‌ ఫోన్‌ల లాంచింగ్‌కు రెడీ అయింది.

పెరిగిన స్మార్ట్ ఫోన్ ధరలు..

ప్రజెంట్ ప్రపంచంలో నెలకున్న యుద్ధ వాతావరణం కారణంగా స్మార్ట్‌ ఫోన్‌లో ఉపయోగించే చిప్స్‌, ఎల్‌ఈడీ స్క్రీన్స్‌, మొదలగునవి దిగుమతి కష్టమైంది. దీంతో స్మార్ట్‌ ఫోన్ రేట్లు అమాంతం గత రెండు మూడేళ్లుగా ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు 15నుంచి 20 వేల రూపాయలు పెడితే మంచి ఫోన్‌ వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కరువైంది. బడ్జెట్ ఫోన్‌ అంటే మినిమం 25 వేల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన కార్బన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు అందుబాటులో ధరల్లో ఫోన్లు అందించడమే లక్ష్యంగా టార్గెట్‌ పెట్టుకుని మళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

చీప్ అండ్ బెస్ట్..

భారత్‌లో గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ ఫోన్‌ ధరలు భాగా పెరిగాయని.. కార్బన్‌ మాతృసంస్థ జైనా గ్రూఫ్ సీఈవో ప్రదీప్‌ జైన్ చెప్పారు. పెరిగిన ధరల కారణంగా చాలా మంది వినియోగదారులు కొత్త ఫోన్లు కొనలేని పరిస్థితిలో ఉన్నారని .. అందుకే , యువత అవసరాలకు సరిపోయేలా స్మార్ట్‌ ఫోన్‌లను అందుబాటు ధరల్లో తీసుకురావాలని కార్బన్‌ కంపెనీ (Karbonn Smartphone Comeback)భావిస్తోందని తెలిపారు. డిజిటల్ కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా వినియోగం, వీడియోల తయారీ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫోన్‌లను తయారు చేశామని తెలిపారు. వారు తీసుకురాబోతున్న ఫోన్‌ కాస్ట్‌, వాటి ఫీచర్లులను ప్రదీప్‌ జైన్‌ వివరించలేదు. వాటి రిలీజ్ డేట్‌ కూడా ఆయన అనౌన్స్ చేయలేదు.

రెబెల్‌ 5G..!

కార్బన్‌ నుంచి కొత్తగా లాంచ్‌ కాబోయే స్మార్ట్‌ ఫోన్‌ రెబెల్‌ 5G (Karbonn Smartphone Comeback)పేరుతో రావచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈఫోన్‌కు సంబంధించిన టీజర్‌ ఇప్పటికే అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌లో కనిపించింది. ఫోన్‌ ధరలపై కస్టమర్లకు భారం పడకుండా , లేటెస్ట్‌ ఫీచర్లతో కొత్త అనుభవాన్ని అందిస్తామని అందులో కంపెనీ చిన్న లీక్‌ ఇచ్చింది. ఫోన్‌ స్పెసిఫికేషన్లు, కాస్ట్‌, లాంచింగ్ డేట్‌ మాత్రం అనౌన్స్ చేయలేదు. పది సంవత్సరాల క్రితం భారత మొబైల్ మార్కెట్‌లో కార్బన్‌ ఫోన్‌లకు మంచి గుర్తింపు ఉండేది. తక్కువ ధరలో ఫీచర్ ఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లను అందిస్తూ కస్టమర్లను ఆకర్షించేది. ఎప్పుడేతే భారత్‌ మార్కెట్‌లోకి చైనా కంపెనీ షావోమీ, విదేశీ బ్రాండ్‌లు వివో, ఒప్పో వంటి బ్రాండ్లు రావడంతో కార్బన్‌ కంపెనీ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆకంపెనీలు పెంచిన అధిక ధరలతో భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ యూజర్స్‌ లబోదిబోమంటున్నారు. ఇప్పుడు పెరిగిన ధరలను నియంత్రించేందుకు అలాగే.. జెన్‌జీని టార్గెట్‌ చేస్తూ తిరిగి కార్బన్‌ రీఎంట్రీ ఇస్తోంది.