WhatsApp Guest Calling Feature

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు డైలీ పెరిగిపోతున్నారు. వరల్డ్ వైడ్‌గా స్మార్ట్ ఫోన్ యూజర్స్‌లో క్రేజ్‌ ఉన్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌. ఈ యాప్‌.. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంది. తాజా మరో కొత్త ఫీచర్‌ని లాంచ్‌ చేసింది. మీరు వీడియో కాల్ మాట్లాడుకోవాలంటే వాట్సాప్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. అంతేకాదు అకౌంట్ లేకుండానే వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడొచ్చని గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సప్‌ అకౌంట్ లేనివారితో కూడా ఈజీగా కనెక్ట్ అయ్యేలా సరికొత్త గెస్ట్ కాలింగ్ ఫీచర్‌ను మెటా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వాట్సప్‌లో అకౌంట్ లేకపోయిన కాల్స్(WhatsApp Guest Calling Feature) మాట్లాడుకోవచ్చు.

గతంలో మన ఎవరితోనైనా వాట్సప్‌లో మాట్లాడాలంటే మనతో పాటు ఎదుటి వ్యక్తికి వాట్సఫ్‌ అకౌంట్ తప్పనిసరి. ఇకపై అలాంటి అవసరం లేకుండా అకౌంట్ లేనివారితో కూడా ఈజీగా కనెక్ట్ అయ్యేలా గెస్ట్ కాలింగ్ ఫీచర్‌ (WhatsApp Guest Calling Feature)తెచ్చింది మెటా. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా వాట్సప్‌ అకౌంట్ ఉన్న ఏ యూజరైనా ఒక కాల్ లింక్‌ను క్రియేట్ చేసి .. దాని తోటి ఉద్యోగులు, విద్యార్థులు, స్టూడెంట్స్‌కి షేర్ చేయవచ్చు. వాట్సప్‌లేని అవతలి వ్యక్తి ఆ లింక్‌ను తమ కంప్యూటర్‌ బ్రౌజర్‌లో ఓపెన్‌ చేసి పేరు ఎంటర్ చేసి కాల్‌లో జాయిన్‌ కావడానికి రిక్వెస్ట్ పంపవచ్చు. ఈకాల్స్‌తో ఎలాంటి టైమ్ లిమిట్ ఉండదు. ఈగ్రూప్‌లో తక్కువలో తక్కువ 32మంది వరకు పాల్గొనే ఛాన్స్ ఉంది.

ఈలింక్‌ విషయంలో యూజర్ల ప్రైవసీకి మెటా హైసెక్యూరిటీ ఇస్తుంది. లింక్‌ ద్వారా వచ్చే గెస్ట్‌ నేరుగా కాల్‌లోకి వెళ్లకుండా, హోస్ట్ హ్యాండిల్స్ ఉండే వెయిటింగ్ రూమ్‌లోకి వెళ్తారు. హోస్ట్ అనుమతిస్తేనే కాల్‌లోకి ఎంట్రీ కాగలడు. గెస్ట్ ద్వారా వచ్చిన వ్యక్తి మిగతా వారి ఫోన్‌ నెంబర్లను యాక్సెస్ చేయలేడు. మేసేజ్‌లు పంపలేరు. అయితే స్క్రీన్‌ షేరింగ్, ఎమోజి రియాక్షన్లు, హ్యాండ్ రైజ్ వంటి ఇంటరాక్టివ్ ఫీచర్లు వాడుకోవచ్చు. మొత్తానికి రోజురోజుకు కస్టమర్లను వాట్సప్‌ కొత్తకొత్త ఫీచర్లతో ఎంతో ఇంట్రస్ట్ పెంచుతుంది.