Government Action on Spam Calls: స్మార్ట్‌ ఫోన్‌ వాడేవాళ్లకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరీ ముఖ్యంగా స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడేవారికి ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ 1నుంచి కాలర్ నేమ్ తప్పనిసరిగా డిస్‌ప్లే చేయాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ట్రాయ్ ఆదేశించింది. దీంతో ఇకపై స్పామ్ కాల్స్‌కు కాలం చెల్లనుంది. గుర్తు తెలియని కాల్స్‌ చెక్ పెట్టేందుకు కేంద్రం ఈకీలక నిర్ణయం తీసుకుంది. నంబర్‌ 1నుంచి తప్పనిసరిగా కాలర్‌ నేమ్‌ డిస్‌ప్లే చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో స్పామ్, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ బెడదకు చెక్ పెట్టినట్లు అయింది. కేంద్రం తీసుకున్న ఈనిర్ణయంతో కొత్త నంబర్‌ నుంచి ఫోన్‌ వస్తే ఆవ్యక్తి పూర్తి పేరు చూపించే కాలర్ ఐడీ సదుపాయం రానుంది. దీంతో ఇప్పటివరకు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా పోతుంది.

తాజా నిర్ణయంతో మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ల నుంచి ఫోన్ వచ్చినప్పుడు మాత్రమే అవతలి వారి పేరు డిస్‌ప్లే అవుతుంది. టెలికాం ఆపరేటర్ల సబ్‌ స్క్రైబర్ డేటా బేస్‌లో నమోదైన కాలర్ పేరు, నంబర్ మన డిస్‌ప్లే పై కనిపిస్తుంది. ఇక ఇంటర్ నేషనల్ కాల్ వస్తే .. పేరుకు బదులు ఇంటర్ నేషనల్ కాల్‌ అని చూపిస్తుంది. ఇన్‌ కమింగ్ కాల్స్ ముగిశాక .. ఫోన్ చేసిన వ్యక్తి నంబర్‌ను పేరుతో పాటు రిట్రీవ్ చేసి సేవ్ చేసుకునే వీలండదని చెప్తోంది. దీనిభట్టి చూస్తే ట్రూకాలర్‌లో చూపించిన విధంగా కాకుండా.. మ్యాన్యువల్‌గా సేవ్ చేయాల్సి ఉంటుంది. కాలింగ్ లైన్ ఐటెంటిఫికేషన్‌ రిస్ట్రిక్షన్‌ ఆప్షన్‌ను చందాదారులు ఓకవేళ ఎంపిక చేసుకుంటే వారి పేరు డిస్‌ప్లేపై చూపించదు. అయితే కేంద్రం తీసుకొచ్చిన CNAP సదుపాయం కేవలం 4G, 5G హైస్పీడ్ మొబైల్ నెట్ వర్క్‌ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. 2G, 3G వాడేవారికి ఈసేవలు వర్తిస్తాయా?.. ఎప్పుటినుంచి అందుబాటులోకి వస్తాయ్‌? అనే వివరాలు ట్రాయ్ చెప్పలేదు. స్పామ్ కాల్స్ వల్ల చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈనిర్ణయంతో స్మార్ట్ ఫోన్ వాడే వారికి మరింత  మేలు జరగనుంద