Huge Demand for First Foldable iPhone

బ్రాండెడ్ డ్రస్‌, మంచి కారేకాదు.. చేతిలో యాపిల్‌ ఫోన్ కూడా ఉంటేనే సూపర్‌ లుక్‌. ఇప్పుడు ఇండియాలో చాలా మంది కోరుకునేది ఇదే. అందుకే ఇండియాలో యాపిల్‌ ఫోన్‌లకు ఉన్న ఆక్రేజే వేరు. మార్కెట్‌లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు.. ముందు రోజు నుంచే స్టోర్ల దగ్గర స్టేచేసి.. కిలోమీటర్ల కొద్ది క్యూ కడుతున్నారు యాపిల్ లవర్స్. ఇటీవల ఐఫోన్‌ 17 విషయంలో అదే జరిగింది. ముంబైలో ఒక్క రోజు ముందే స్టోర్‌ ముందు కొనుగోలు దారులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. వారిని కంట్రోల్ చేయడానికి స్టోర్ సెక్యూరిటీ నానా కష్టాలు పడ్డారు. టోకెన్లు ఇచ్చిన రాత్రంతా వెయిట్ చేయించిన పరిస్థితి చూశాం. అందుకే యాపిల్‌కి ఫ్రీ బుకింగ్స్‌కి కూడా మంచి డిమాండ్(Huge Demand for First Foldable iPhone ) ఉంది. అయితే ఎంతో కాలంలో యాపిల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్‌ డ్యుయో ఇప్పడు రావడంతో మార్కెట్‌లో యాపిల్ బజ్‌ క్రియేట్ అయింది. అక్టోబర్ 16 వరల్డ్ వైడ్‌గా ప్రీ ఆర్డర్లు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా ఫస్ట్ సేల్ స్టాక్ మొత్తం క్లియర్ అయింది. విపతీతమైన డిమాండ్ వల్ల ఇప్పుడు ఈఫోన్ డెలివరీ కోసం 2027 జనవరి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో ఈఒక్క ఫోన్‌కే కాదు .. యాపిల్ నుంచి ఏదొచ్చినా క్రేజే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ డ్యుయోకి కూడా అంతే అపూర్వ స్పందన కనిపించింది. మరోవైపు ఆకర్షనియమైన ట్రెడ్- ఇన్ క్రెడిట్లు, నో- కాస్ట్ EMI, సెలక్ట్‌టెడ్ బ్యాంకుల కార్డులపై ఇన్‌స్టాంట్ క్యాష్‌ బ్యాక్ లాంటి ఆఫర్లు ప్రకటించడంతో .. హెవీ కాస్ట్ అయినప్పటికీ ఐఫోన్ డ్యుయోకి మంచి స్పందన(Huge Demand for First Foldable iPhone) వచ్చింది.

ప్రీ- బుకింగ్స్ మొదలైన ఫస్ట్‌రోజే యాపిల్ రిటైల్ స్టోర్లలో స్టోర్ పిక్ -అప్ స్లాట్లన్నీ నిండిపోయాయి. ఆన్ లైన్లో ఆర్డర్లు అందుబాటులోకి ఉన్నప్పటికీ, ఇప్పుడు బుక్ చేసుకుంటున్న వారికి డెలివరీ డేట్స్ 2027 ఫిబ్రవరి చూపిస్తున్నాయి. అధికారికంగా ఈ ఫోన్ అక్టోబర్ 23 నుంచి రిటైల్ స్టోర్లలో సేల్స్ స్టార్ట్ అవుతుంది. ఐఫోన్ డ్యుయో ధరలు(Huge Demand for First Foldable iPhone ) ప్రీమియం సెగ్మెంట్‌లో భారీ స్థాయిలో ఉన్నాయి. 256 జీబీ ఫోన్‌ అయితే రూ. 2,99,900 ఉంది. 512 జీవీ అయితే రూ. 3,24,900 కాగా.. 1టీబీ రూ. 3,74,900.. 2టీబీ రూ. 4,49,900 లుగా రేట్‌ ఫిక్స్ చేశారు. ఈ ఫోన్.. స్టార్ వైట్, నైట్ స్కై లాంటి రెండు కలర్స్‌లో ఆకర్షణీయంగా అందుబాటులో ఉంది. ఇందులో 5.4 అంగులాల ఔటర్ డిస్‌ప్లే, ఓపెన్ చేసిన తర్వాత 7.6 అంగులాలు ఉంది. ఇన్నర్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ స్క్రీన్ కూడా ఉంది. యాపిల్ ఓన్‌గా డవలప్ చేసిన స్ట్రాంగ్ A20 ప్రో చిప్ సెట్‌తో ఈఫోన్ పనిచేస్తుంది. లేటెస్ట్‌ ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది ఆపరేట్‌ అవుతుంది. కేవలం ఈ సిమ్‌కు మాత్రమే ఈఫోన్ సపోర్ట్ చేయడం దీని ప్రత్యేకత.