జియో ఐపీవోకి మస్క్ స్టార్లింక్కీ లంకేంటి?
Jio vs Elon Musk Starlink War: ఎలాన్‌మస్క్ ఎగేసుకుని వచ్చేసి మొత్తం ఇండియన్ మార్కెట్‌నంతా ఆక్రమించేస్తానంటే అంబానీలు, అదానీలు ఎందుకు ఊరుకుంటారు? భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. అక్టోబరు 21న మొదలై అక్టోబరు 23న ఈ లిస్టింగ్ ప్రక్రియ ముగుస్తుంది. రూ.37, 700 కోట్లు సమీకరించాలన్న టార్గెట్‌తో వస్తోంది జియో ఐపీవో

Jio vs Elon Musk Starlink War: నోటికొచ్చినట్లు మాట్లాడాడు. 165 దేశాలకు విస్తరించిన తన స్టార్ లింక్ నెట్‌వర్క్‌ని ఇండియాలో తొక్కేస్తున్నారన్నట్లు మాట్లాడాడు. అసలు ఇండియాకు ప్రధాని మోడీనో అంబానీనో అర్ధంకావడం లేదంటూ రాహుల్‌గాంధీ పూనినట్లు మాట్లాడాడు. స్నేహంగా ఉంటూనే ట్రంప్ వెనుక గోతులు తవ్వినవాడిని అంత గుడ్డిగా నమ్మేయలేం. అలాగని ఈ గ్లోబల్ మార్కెట్‌లో అతనికి అడ్డంకులు సృష్టించలేం. ఎలాన్‌మస్క్ నోరుజారుతున్నాడనో, ఇంకా రచ్చ చేస్తాడనో భయపడటం లేదు భారత్. ఆ టైమ్ వచ్చినప్పుడు జరిగిపోతుందంతే. ఇప్పుడా టైమ్ వచ్చేసింది.
జియో పబ్లిక్ ఇష్యూకి, ఎలాన్‌మస్క్ స్టార్‌లింక్‌కి లింకుంది. స్పెక్ట్రమ్ నిబంధనలు, భద్రతా కారణాలు, అప్లికేషన్ ప్రాసెసింగ్ వంటి కారణాలు చెబుతూ వస్తున్నా.. ఆలస్యం వెనుక అసలు కారణం మాత్రం కార్పొరేట్ స్ట్రాటజీనే. అవును ఎలాన్‌మస్క్ ఎగేసుకుని వచ్చేసి మొత్తం ఇండియన్ మార్కెట్‌నంతా ఆక్రమించేస్తానంటే అంబానీలు, అదానీలు ఎందుకు ఊరుకుంటారు? భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. అక్టోబరు 21న మొదలై అక్టోబరు 23న ఈ లిస్టింగ్ ప్రక్రియ ముగుస్తుంది. రూ.37, 700 కోట్లు సమీకరించాలన్న టార్గెట్‌తో వస్తోంది జియో ఐపీవో.
జియో ఐపీవో ప్రక్రియ పూర్తికాకముందే ఎలాన్‌మస్క్‌కి పచ్చజెండా ఊపేస్తే అంబానీ కొంప కొల్లేరవుతుంది. అంతరిక్షం నుంచి స్టార్‌లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేస్తే మార్కెట్‌లో మస్క్ మోనోపలీ మొదలవుతుంది. ఇన్వెస్టర్ల దృష్టి మళ్లుతుంది. ఆటోమేటిగ్గా జియో మార్కెల్ వాల్యుయేషన్ భారీగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా జియో ఐపీవో లిస్టింగ్ ప్రక్రియ పూర్తయ్యేదాకా ప్రభుత్వం స్టార్‌లింక్‌కి పర్మిషన్లను ఆలస్యం చేసిందనే వాదనకు బలం చేకూరుతుంది.
జియో ఐపీవో పూర్తవ్వగానే స్టార్‌లింక్ కూడా కాంపిటీషన్‌లోకి వచ్చేస్తుంది. మస్క్‌ని చూసి ఎవరూ భయపడటం లేదని.. టెలికాంలో ఎలాంటి పోటీకైనా రెడీ అని అంబానీ కూడా తొడగొడుతున్నారు. ఎలాన్‌మస్క్‌కి స్పేస్ ఎక్స్ ఉంది. జియో టెలికాం టవర్లు వేయలేని మారుమూల ప్రాంతాల్లో, సరిహద్దుల్లో కూడా స్టార్‌లింక్ నిరంతరాయంగా నెట్ సేవలు అందించగలదు. అంతరిక్షంలో వేలాది శాటిలైట్లతో మస్క్‌కి ఓ పెద్ద నెట్‌వర్క్ రెడీగా ఉంది. భారత్‌లో టెలికాం రంగాన్ని శాసిస్తున్న జియో ఎలాన్‌మస్క్ నెట్‌వర్క్‌తో ఢీకొట్టేందుకు ఉపగ్రహాల వేటలో పడింది. స్టార్‌లింక్‌తో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని తన మార్కెట్ నిలబెట్టుకునేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. భారీ ఐపీవో జియోకి పెద్ద అసెట్ కాబోతోంది.



