స్టార్ లింక్ ప్రారంభానికి సిద్ధం..! మస్క్ కీలక నిర్ణయం
స్టార్ లింక్ భారత్‌లో ఐదేళ్లుకు పైగా ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, టెలికాం ఆపరేటర్లతో పనిచేస్తోందని తాజా ఆసంస్థ తెలిపింది. భారత వినియోగదారులకు సురక్షిత సేవలు అందించేందుకు దేశంలోనే ప్రత్యేక వ్యవస్థలు, గేట్వేలు, ఇతర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వీటికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు కూడా ఉన్నాయని చెప్పింది

Starlink vs Reliance Jio
ఇండియాలో స్టార్ లింక్ స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామని ఆ సంస్థ అనౌన్స్ చేసింది. హైస్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు స్టార్ లింక్ సిద్ధంగా ఉందని ఎలన్ మస్క్‌కు చెందిన సంస్థ ప్రకటించింది. రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ పోటీపై చేసిన ప్రకటనకు స్పందించింది. పోటీలో వెనక్కి తగ్గమని వెల్లడించింది. సంస్థ చేసిన ప్రకటనపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఎంతో అభినందిస్తున్నా అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు మస్క్.
ఇటీవల ఇండియాలో స్టార్ లింక్ ప్రవేశంపై మస్క్, రిలయన్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. తమను రిలయన్స్ అడ్డుకుంటోందని ఆరోపించింది. అంతేకాదు భారత్‌కు అసలైన అధిపతి .. ముకేశ్ అంబానీ అంటూ ఆరోపణలు చేశారు మస్క్. భారత్‌లో రిలయన్స్(Starlink vs Reliance Jio ) గుత్తాధిపత్యాన్ని కొనాసాగించాలని చూస్తున్నారంటూ సెటైర్లు వేశారు. స్టార్ లింక్ భారత్‌లో ఐదేళ్లుకు పైగా ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, టెలికాం ఆపరేటర్లతో పనిచేస్తోందని తాజా ఆసంస్థ తెలిపింది. భారత వినియోగదారులకు సురక్షిత సేవలు అందించేందుకు దేశంలోనే ప్రత్యేక వ్యవస్థలు, గేట్వేలు, ఇతర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వీటికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు కూడా ఉన్నాయని చెప్పింది.
మస్క్ ఆరోపణలను సింఫుల్ తీసుకుంది రిలయన్స్ . శాటిలైట్ కమ్యూనికేషన్ల రంగంలో స్టార్ లింక్ సహా అన్ని సంస్థల పోటీని స్వాగతిస్తున్నామని రిలయన్స్ ప్రకటించింది. భారతీయ సంస్థలైనా, విదేశీ కంపెనీలైనా దేశ చట్టాలకు లోబడి పనిచేయాలని.. విధివిధానాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. తాము కూడా జియో(Starlink vs Reliance Jio ) శాటిలైట్ సేవల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది.



