ఢిల్లీ విలవిల.. దివాళికి ముందే పంజా
చలికాలం వస్తుందంటే అందరికి చలితో వణుకుపుడుతుంది. కాని ఢిల్లీ మాత్రం పోగతో .. పొల్యుషన్‌తో గడగడలాడిపోతుంది. దివాళి ఫెస్టివల్‌కి ముందే ఢిల్లీని పొల్యుషన్ అనే పెనుభూతం కమ్మేసింది.

Delhi Air Pollution
చలికాలం వస్తుందంటే అందరికి చలితో వణుకుపుడుతుంది. కాని ఢిల్లీ మాత్రం పోగతో .. పొల్యుషన్‌తో గడగడలాడిపోతుంది. ప్రతీ ఏడాదికంటే ఈసారి ముందే వచ్చేసింది. దీపావళి పండుగ రాకముందే ఢిల్లీని పొల్యుషన్ అనే పెనుభూతం కమ్మేసింది. దేశ రాజధానిని వాయు కాలుష్యం(Delhi Air Pollution) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పుడే నగరాన్ని కాలుష్య మేఘాలు కమ్మేస్తున్నాయి. రోజురోజుకూ గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 451కు చేరింది. దీంతో గాలి నాణ్యత అత్యంత తీవ్రమైన స్థాయికి చేరినట్లు నివేదికలు వెల్లడించాయి.
పొల్యూషన్ భూతం..
ఢిల్లీలో పొల్యూషన్ సీజన్ వస్తుందంటే ప్రజలు హడలిపోతారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఈసారి ఆపెనుభూతం కాస్త ముందే దాపురించింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను కాల్చడమే.. ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి కారణమని భావిస్తున్నారు. దీపావళికి ముందే ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయింది. సాధారణంగా, దీపావళి తర్వాతే ఢిల్లీలో శీతాకాలం పొగమంచు మొదలవుతుంది. కాని ఈసారి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ నవంబర్ తొలి వారంలోనే.. అత్యంత అధ్వానంగా తయారైంది. ఏక్యూఐ 400పైన నమోదైంది. అక్టోబర్ 30న, వర్షాల కారణంగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ 60గా నమోదైంది. ఎనిమిదేళ్ల తర్వాత అక్టోబర్‌లో ఢిల్లీలో అత్యంత స్వచ్ఛమైన గాలి నాణ్యత నమోదైంది. అయితే, నవంబర్ మొదలయ్యే నాటికి కాలుష్యం(Delhi Air Pollution) ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. నీళ్లు చల్లడం, పొల్యూషన్ కంట్రోల్ గన్‌లను ఉపయోగించడం, నిర్మాణ ప్రదేశాలను పర్యవేక్షించడం లాంటి కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టారు. గతేడాది దీపావళికి ముందురోజు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ పూర్ కేటగిరీలో నమోదైంది. ఈ ఏడాది దీపావళికి వారం ముందే.. ఏక్యూఐ 300 మార్కును దాటింది. ఇప్పుడే ఇలా ఉంటే దీపావళి కూడా దగ్గరపడుతుండటంతో.. టపాసుల వల్ల అదనపు కాలుష్యం పెరుగుతుందంటున్నారు.
పాక్ కారణం..!
ఢిల్లీ కాలుష్యం వెనుక పంజాబ్, హర్యానానే కాదు.. పాకిస్తాన్ కూడా కారణంగా తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ అంతటా వ్యవసాయ భూముల్లో మంటలు పెట్టడమే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు అనుమానిస్తున్నారు. శాటిలైట్ డేటా ప్రకారం.. ఈ ఏడాది పాకిస్తాన్ పంజాబ్‌లో పంటలను ఎక్కువగా కాల్చేస్తున్నారు. ఇండియా పంజాబ్‌తో పోలిస్తే.. పాకిస్తాన్ పంజాబ్‌లో పంట వ్యర్థాల కాల్చివేత 4 రెట్లు ఎక్కువగా నమోదైంది. అక్టోబర్‌లో పాకిస్తాన్‌లో 13 వేలకు పైగా పంటలు కాల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన పంజాబ్‌లో 3 వేలకు పైన మాత్రమే నమోదయ్యాయ్.
ప్రస్తుతం.. ఆ ప్రాంతమంతటా వాయువ్య గాలులు వీస్తుండటంతో.. పాకిస్తాన్‌లోని పంట వ్యర్థాల నుంచి వచ్చే పొగ(Delhi Air Pollution) పంజాబ్, హర్యానా, ఢిల్లీ అంతటా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. గాలి వేగం తక్కువగా ఉండటం వల్ల కూడా.. కాలుష్య కారకాలు తొందరగా చెదిరిపోవడం లేదు. పైగా.. స్థానిక ఉద్గారాలు పెరగడం కూడా, రాబోయే రోజుల్లో ఎయిర్ క్వాలిటీ మరింత క్షీణించేందుకు కారణమవుతుందని చెబుతున్నారు.



