China Marriage Scam

చైనాలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్ల సంక్షోమం కొత్త మోసాలకు దారితీస్తోంది. చైనాలో సరిఫడా అమ్మాయిలేకపోవడంతో పెళ్లికాని యువకుల సంఖ్య నానాటి పెరిగిపోతుంది. దీంతో అమ్మాయి కోసం విదేశాల వైపు చూస్తున్నారు. ఈక్రమంలోనే వారిని లక్ష్యంగా చేసుకుని సరిహద్దులు దాటిన పెళ్లిళ్ల స్కామ్‌లు(China Marriage Scam) పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమోనిలు చైనా యువకులను ఆర్థికంగా మోస చేస్తున్నాయి. అదేక్రమంలో విదేశీ మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదిక వెల్లడించింది.

అయితే చైనా ఈపరిస్థితి రావడానికి కారణం.. చైనాలో దశాబ్దాలుగా కొనసాగిన ‘ఒకే బిడ్డ’ విధానం. కొడుకులే కావాలన్న ధోరణి ఫలితంగా, కోట్ల సంఖ్యలో పురుషులకు..
సరిపడా మహిళలు లేక పెళ్లిళ్లు కాలేదు. మరీ ముఖ్యంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువకులు పెళ్లి చేసుకోవడం కష్టంగా మారింది. దేశంలో వివాహాల నమోదు కూడా గణనీయంగా తగ్గి, ఇటీవల 61 లక్షలకు పడిపోయింది. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమ మ్యాట్రిమోనియల్ నెట్‌వర్క్‌లు పుట్టుకొచ్చాయి. మయన్మార్, వియత్నాం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి ఆగ్నేయాసియా దేశాలతో పాటు ఆఫ్రికా, మాజీ సోవియట్ యూనియన్ దేశాల నుంచి యువతులను పెళ్లికోసం(China Marriage Scam) ఎరగా వేస్తున్నారు. చైనా యువకులకు విదేశీ వధువులను చూపిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్నిసార్లు నకిలీ పెళ్లి వేడుకలు, దొంగ పత్రాలతో మోసం చేస్తున్నారు. తీరా డబ్బు చేతులు మారగానే వధువు అదృశ్యమవుతోంది.

ఇదిలా ఉంటే ఉద్యోగం, మంచి జీవితం అంటూ యువలకు ఆశ చూపి విదేశీ మహిళలను బలి చేస్తున్నాయి మ్యాట్రిమోని సంస్థలు. మోసపూరితంగా పెళ్లిళ్లలోకి దించుతున్నాయి. ఇటీవల చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో గల జిన్‌టియాన్ కౌంటీ పోలీసులు ఈ తరహా మోసాలపై(China Marriage Scam) నిఘా పెట్టారు. మ్యాట్రిమోనీ సంస్థలను నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. ఈ తరహా మోసాలపై నిఘాపెట్టి యువతీ, యువకులను మోసం చేస్తున్న సంస్థల ఆటకట్టిస్తున్నారు.