కాంగోలో ఎబోలా ఉగ్రరూపం.. చేతులెత్తేసిన అధికారులు
ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎబోలా బాధితుల సంఖ్య 11 వేలు దాటగా.. మరణాల సంఖ్య 5,387కు చేరింది.

Congo Ebola Outbreak
ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎబోలా బాధితుల సంఖ్య 11 వేలు దాటగా.. మరణాల సంఖ్య 5,387కు చేరింది. కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవంబర్ 11న విడుదల చేసిన గణాంకాలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో దాదాపు సగం మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన(Congo Ebola Outbreak ) కలిగిస్తోంది. మే నెలలో ఎబోలా వైరస్ వ్యాప్తిని అధికారికంగా ప్రకటించినప్పటికీ.. అంతకుముందే కొన్ని నెలలుగా వైరస్ వ్యాపించినట్లు వైద్య ఆధారాలు సూచిస్తున్నాయి.
మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి కాంగోలోని 26 ప్రావిన్సుల్లో ఎనిమిది ప్రావిన్సులకు విస్తరించింది. ముఖ్యంగా ఇటూరి, నార్త్ కివు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ వ్యాప్తికి కారణమైనది బుండిబుగ్యో ఎబోలా వైరస్. దీనికి ప్రస్తుతం నిర్దిష్టంగా ఆమోదించిన వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ అందుబాటులో లేదు. దీంతో వైరస్ను కట్టడి చేయడం వైద్యాధికారులకు పెను సవాలుగా మారింది. మరోవైపు అంతర్గత ఘర్షణలు, ఆసుపత్రుల్లో సదుపాయాల కొరత, రవాణా సమస్యలు వైరస్ నియంత్రణకు అడ్డంకులుగా(Congo Ebola Outbreak ) మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వైద్య సిబ్బందిపైనా దాడులు జరగడంతో చికిత్స, వైరస్ సోకిన వారిని గుర్తించే ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
ఎబోలా వ్యాప్తి ఇప్పటికే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎబోలా విపత్తుగా నమోదైంది. 2014 నుంచి 2016 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో సంభవించిన ఎబోలా మహమ్మారిలో 28 వేల మందికి పైగా వైరస్ బారినపడగా.. 11 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత కాంగో వ్యాప్తి మాత్రం తక్కువ వ్యవధిలోనే భారీ సంఖ్యలో కేసులు, మరణాలకు కారణమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటన ప్రకారం కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. కొత్త హాట్స్పాట్లు(Congo Ebola Outbreak ) పుట్టుకొస్తూనే ఉన్నాయి. వ్యాధి నియంత్రణలోకి వచ్చిందని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అటు వైద్య సేవల సంస్థ ఎంఎస్ఎఫ్ కూడా క్షేత్రస్థాయిలో వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కాంగోలో ఎబోలా కట్టడికి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి.



