ప్రపంచానికి మరో వైరస్ ముప్పు.. కరోనా కన్నా యమడేంజర్..!
ఇప్పటివరకు నమోదైన ఎబోలా కేసుల.. మరణాల సంఖ్యలను పరిస్థితి అంత్య కలవరపాటుకు గురిచేస్తోంది. 9వేల కేసు నమోదైతే .. వాటిలో సగం 4వేల పైగా డెత్ కేసులు ఉన్నాయి. నమోదవుతున్న డెత్ రేట్ చూస్తే ..కరోనాతో పోలిస్తే ఇది యమడేంజర్ అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు

Ebola Outbreak in Congo:
కరోనా.. ఈమహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక్కసారిగా ప్రపంచాన్ని మొత్తాన్ని తలకిందులుచేసింది. ఆ మహమ్మారి చేసిన గాయలు ఇప్పటికి ప్రపంచ దేశాలను వీడలేదు. భారత్ లాంటి దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకొని ముందుకుసాగుతున్నాయి. కరోనా మహమ్మారిని మరిచిపోతున్న ఈటైంలో ఇప్పుడు ఎబాలో కలవరపెడుతోంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగాలో ఎబోలా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒకరినుంచి ఒకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు మొత్తం 9, 415 కేసులు నమోదు కాగా.. వారిలో 4, 536మంది మరణించినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈలెక్కలను బట్టి చూస్తేనే తెలుస్తోంది.. ఇది కరోనా కంటే యమ డేంజర్ మహమ్మారి అని. అయితే ఇప్పుడు ఎబోలా వ్యాధి కాంగో నుంచి ఈదేశంలోని 8వ ప్రావిన్స్ అయినా నార్త్ ఉబాంగిలోను వ్యాప్తి చెందుతోందని కాంగో బయోమెడికల్ పరిశోధనా సంస్థ (Ebola Outbreak in Congo ) వెల్లడించింది.
నార్త్ ఉభాంగిలో రెండు కేసులు నమోదు కాగా.. వారిలో ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈప్రావిన్స్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశ సరిహద్దుకు ఆనుకుని ఉండడంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించడం మరింత కీలకంగా మారింది. వైరస్ సోకిన వారి గుర్తించడంతో పాటు .. వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని క్వారంటైన్ చేస్తున్నారు. వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటివరకు నమోదైన ఎబోలా కేసుల.. మరణాల సంఖ్యలను పరిస్థితి అంత్య కలవరపాటుకు గురిచేస్తోంది(Ebola Outbreak in Congo ). 9వేల కేసు నమోదైతే .. వాటిలో సగం 4వేల పైగా డెత్ కేసులు ఉన్నాయి. నమోదవుతున్న డెత్ రేట్ చూస్తే ..కరోనాతో పోలిస్తే ఇది యమడేంజర్ అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈమహమ్మారికి సంబంధించి ఆగష్టులో నెలలో మొదటి కేసునమోదు కాగా.. అతి తక్కువ కాలంలోనే వేలాది మందికి వ్యాప్తి చెందింది. వైరస్ సోకిన ప్రతీ ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖలు తెలుపుతున్నాయి. వ్యాధి పట్ల అవగాహనలోపం, మారుమూల ప్రాంతాలకు వేగంగా చికిత్స అందించడంలో నిర్లక్ష్యం కారణంగా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందిందని చెబుతున్నారు నిఫుణులు. రోజురోజుకు వైరస్ డెత్ రేటు పెరగడంతో బాధితులను క్వారంటైన్ చేసేందుకు వైద్య బృందాలు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాయి.
ఎబోలాను కట్టడిచేసేందుకు WHO రంగంలోకి దిగింది. అంతర్జాతీయ సహాయక సంస్థలు కాంగో ప్రభుత్వంతో కలిసి ఎబోలా వైరస్ వ్యాప్తి నివారణకు వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాధి సోకిన ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లు పెట్టి.. బాధితులకు వ్యాక్సిన్లు, పీపీఈ కిట్లు, అవసరమైన మెడిసిన్ సరఫరా చేస్తున్నారు. మరోవైపు కాంగో సరిహద్దు కలిగిన పోరుగు దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. కాంగో(Ebola Outbreak in Congo ) నుంచి వచ్చే ప్రతీఒక్కరికి స్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాయి. ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాయి. ఎబోలా వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే తీవ్ర జ్వరం, తీవ్రమైన రక్తస్రావం, శరీరం బలహీనపడడం, వాంతులు ఉంటాయి. ఈవ్యాధి గాలి ద్వారా కాకుండా బాధితుల శరీర ద్రవాల నుంచి నేరుగా ఇతరులకు వ్యాపిస్తోంది.



