Bangladesh Anti India Protest

ఫ్రాన్స్‌లో జరిగిన నిరసనలు బంగ్లాదేశ్‌కు వ్యాపించాయి. పెరుగుతున్న నిత్యావసరాలు, ఇంటి అద్దెలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపితే.. బంగ్లాదేశ్‌లోను సేమ్ సీన్ రిపీట్‌ అయింది. బంగ్లాదేశ్‌ లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్‌ కోతలు, ఇంధనం, గ్యాస్‌ కొరతపై ప్రజా గ్రహం కట్టులుతెంచుకుంది. దీంతో ఢాకాలోని నేషనల్‌ మ్యూజియాన్ని ముట్టడించారు. నేషనల్ మ్యూజియంకు ఎదుట భారీ ర్యాలీ చేశారు. ప్రధాని తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. హోం, ఇంధన శాఖల మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. NCP ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో ఢాకా దద్దరిల్లింది.

నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (NCP) ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగాయి. NCP కన్వీనర్‌ నహీద్‌ ఇస్లాం నేతృత్వంలో జరిగిన ర్యాలీలో వేలాది మంది ప్రజలు, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ర్యాలీలో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది ఢిల్లీ కాదు.. ఢాకా అంటూ నేతలు నినాదాలు వినిపించాయి. సభకు హాజరైనవారు కూడా ఢాకా.. ఢాకా అంటూ పెద్ద ఎత్తున అరిచారు. ర్యాలీలో పాల్గొన్న NCP కన్వీనర్‌ నహీద్‌ ఇస్లాం భారత్‌పై(Bangladesh Anti India Protest) విమర్శలు చేశాడు. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా భారత్‌ కుట్రలు చేస్తోందని ఆరోపించాడు. సరిహద్దుల్లో హత్యలు జరుగుతున్నాయని… అసోం, పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలపై వేధింపులు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో మసీదులను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే గంగా జలాల ఒప్పందాన్ని న్యాయంగా పునరుద్ధరించకపోతే మరోసారి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ప్రపంచ యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోను(Bangladesh Anti India Protest) ఇంధన సంక్షోభం తలెత్తింది. భారతదేశంలాగా ఇంధన కొరతను అక్కడి ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. దీంతో ఇంధన సరఫరాకు కొన్ని నెలలుగా తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. మరోవైపు దేశంలో కొన్నినెలలుగా ఇంధర కొరత కారణంగా అనే పరిశ్రమలపై ఆప్రభావం చూపుతోంది. విద్యుత్‌ కోతలతో వస్త్ర పరిశ్రమల్లో ఉత్పత్తి కూడా దెబ్బతింటోంది. అటు 2026లో ద్రవ్యోల్బణం సుమారు 8.5 శాతం ఉండటంతో ప్రజలపై ధరల భారం పడుతోంది. గత ఏడాదితో పోలిస్తే మరో 21 లక్షల మంది పేదరికంలోకి వెళ్లినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నహీద్‌ ఇస్లాం డిమాండ్‌ చేశారు. హోం మంత్రి సలాహుద్దీన్‌ అహ్మద్‌, ఇంధన మంత్రి ఇక్బాల్‌ హసన్‌ మహమూద్‌ రాజీనామా చేయాలని కోరారు. వారు పదవుల నుంచి తప్పుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, ప్రధాని తారిఖ్‌ రెహ్మాన్‌ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

అయితే ఈ NCP కూడా మన దేశంలో CJP లాంటిదే. 2024లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించిన విద్యార్థుల ఉద్యమం నుంచే ఈ NCP పుట్టుకొచ్చింది. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర CJP చేసిన ఉద్యమాన్ని ప్రభుత్వం సమర్థవంగా ఎదుర్కొంది. అయితే ఢిల్లీ నిలువరించడానికి.. ఇది ఢాకా అంటూ బంగ్లా (Bangladesh Anti India Protest)ప్రభుత్వానికి అక్కడ NCP ముందస్తు హెచ్చరిక పాస్ చేసింది. దేశీయ సమస్యలపై మొదలైన ఈ నిరసనల్లో భారత్‌ వ్యతిరేక నినాదాలు కూడా వినిపించడం ఉత్కంఠ రేపుతోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఒడుదొడుకులకు లోనైన సంబంధాలపై మరోసారి చర్చకు దారితీసింది.