Armenia Parliament Brawl

అర్మేనియా పార్లమెంట్‌లో ఇవాళ జరిగిన ఘటనతో ఆదేశ చరిత్రలో బ్లాక్‌ డే అని చెప్పొచ్చు. పార్లమెంట్ నేషనల్‌ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీసింది. ఫైనల్‌గా ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఎంపీలా..? లేక రౌడీలా అనేలా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు (Armenia Parliament Brawl ) కురిపించుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. చేతికి అందిన వాటితో దాడులు చేసుకున్నారు. ఈదృశ్యాలన్నీ కూడా లైవ్‌లో కనిపించాయి. స్పీకర్ రూబెన్‌ రుబిన్యన్‌ కూడా లైవ్‌ కట్ చేయడానికి ఇష్టపడలేదు. పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో అందరికి తెలియాలి.. లైవ్ కట్ చేయొద్దని అధికారులను ఆదేశించడం కొసమెరుపు.

అయితే పార్లమెంట్‌లో అధికార సివిల్ కాంట్రాక్ట్‌ పార్టీ, ప్రతిపక్ష స్ట్రాంగ్ అర్మేనియా కూటమికి చెందిన ఎంపీ మధ్య వాగ్వాదం జరిగింది. సివిల్ కాంట్రాక్ట్ ఎంపీ టారోన్‌ చఖోయన్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ కోచార్యన్‌ అనుచరులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈక్రమంలో ప్రతిపక్ష నేత నరేక్‌ కరపెట్యాయన్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువురు ఎంపీల మధ్య వాగ్వాదం స్టార్ అయింది. పార్లమెంట్‌ హాల్‌లో మొదలైన గొడవలో పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ వహాగ్న్‌ అలెక్యాన్యన్‌ ప్రతిపక్ష సభ్యులపైకి కుర్చీ(Armenia Parliament Brawl ) విసిరారు. ఆతర్వాత కారిడార్‌లో కొట్టుకునే దాకా వెళ్లింది.

తారాన్‌ చఖోయన్‌, ప్రతిపక్ష ఎంపీ గార్నిక్‌ దావ్త్యాన్‌ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈదాడిలో ప్రతిపక్ష ఎంపీ ఆండ్రానిక్‌ గెవార్గ్యాన్‌కు గాయం(Armenia Parliament Brawl) అయింది. ఆయన ముక్కు నుంచి రక్తం వచ్చింది. మరో ఎంపీ బట్టలు చినిగిపోయాయి. చివరకు ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో.. స్పీకర్ పరిస్థితిని అదుపుచేయలేక .. సభను వాయిదా వేశారు. భద్రతా సిబ్బంది పిలిచి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రజల కోసం ఎన్నికైన ఎంపీలు .. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ విలువైన పార్లమెంట్ సమయాన్ని వృధా చేయడమే కాకుండా విచక్షణ కోల్పోయి దాడులు చేసుకోవడంపై ప్రజలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తర్వాతి తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ఆయా పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే దేశ పరువు తీశారంటూ మండిపడుతున్నారు.