బద్రీనాథ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన హెలికాప్టర్

Uttarakhand Helicopter Crash
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలింది. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఫైలట్ సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. ఈప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి స్పందించారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు దృవీకరించారు. ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఘటనపై సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు(Uttarakhand Helicopter Crash) సహాయ చర్యలు చేపడుతున్నాయని చెప్పారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ దామ్ వెళ్లిన కొందరు ఓ ప్రైవేట్ హెలికాప్టర్ తిరిగిపయనమయ్యారు. అది జోషిమఠ్ సమీపంలోని చాయ్ గ్రామ సమీపంలోకి రాగానే కుప్పకూలింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన VT-HCX రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ హెలికాప్టర్, శుక్రవారం మధ్యాహ్నం 1:12 గంటలకు బద్రీనాథ్ నుంచి బయలుదేరింది. జోషిమఠ్‌కు ఎదురుగా ఉన్న హాతీ పహాడ్ దగ్గర ఆర్మీ పోస్ట్ సమీపంలో చివరిసారిగా దీనితో(Uttarakhand Helicopter Crash) సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంచు కురుస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో దట్టమైన మేఘాలతో పాటు వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ నెలలోనే ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్ర మార్గాల్లో రెండు ప్రమాదాలు తప్పాయి. రెండు హెలికాప్టర్లు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. వాతావరణం అనుకూలించక ఒకటి రుద్రప్రయాగ్‌లో, సాంకేతిక సమస్యతో మరొకటి తెహ్రీలో ల్యాండ్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప్రమాదం(Uttarakhand Helicopter Crash) చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ప్రయాణికుల పరిస్థితిపై ఎంక్వైరీ చేస్తున్నారు.



