మృగానికైనా మనసుంటది.. వీడ్ని చూసి అది కూడా సిగ్గుపడుద్ది
ఉగాండాలో ఓ నరరూప రాక్షసుడు.. మనషులను చంపి తినే భక్షకుడు.. ఆదేశాన్ని భయాందోళనకు గురి చేశాడు. గడిచిన 15ఏళ్లలో ఏకంగా 38మందిని అతి కిరాతంగా చంపి వారిని మృగంలా తినేశాడు.

Uganda Serial Killer Mujurizi Moses Arrested
ఉగాండాలో ఓ నరరూప రాక్షసుడు.. మనషులను చంపి తినే భక్షకుడు.. ఆదేశాన్ని భయాందోళనకు గురి చేశాడు. గడిచిన 15ఏళ్లలో ఏకంగా 38మందిని అతి కిరాతంగా చంపి వారిని మృగంలా తినేశాడు. మృగానికైనా మనసుంటుందికానీ.. వీడికి మాత్రం లేదని నిరూపించాడు. ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ ముజురిజి మోసెస్‌ను పోలీసులు అరెస్ట్ (Uganda Serial Killer Mujurizi Moses Arrested )చేశారు. అరెస్ట్ చేసినట్లు ఉగాండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, జనరల్ ముహూజి కైనెరుగబా సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఎక్స్ వేదికగా ప్రకటించింది. నరరూప రాక్షసుడి అరెస్ట్‌తో ఆదేశ పౌరులు సంబరాలు చేసుకున్నారు. వాడు అరెస్ట్ కాగానే అప్పటి వరకు అరచేతిలో ప్రాణాన్ని పెట్టుకుని బతికిన ప్రజలు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. దుర్మార్గుడు మజురిజి మోసెస్‌ను భద్రతా దళాలు అరెస్ట్ చేశామని తెలియడంతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.
ఉగాండా చరిత్రలోనే అత్యంత కిరాతకుడు ఇతడు. మసాకా, ఇబందా, కాజో జిల్లాల్లో 2010 నుంచి 2025 మధ్య కాలంలో అనేక హత్యలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. సీరియల్ కిల్లర్‌ని 15 ఏళ్లలో 38 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అడవి మృగాల కంటే అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. మోసెస్ దర్యాప్తు(Uganda Serial Killer Mujurizi Moses Arrested )లో అత్యంత భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. క్రూరంగా దాడి చేసేవాడని తేలింది. కుటుంబాలకు కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని .. అర్థరాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి కత్తితో అందరిని నరికి చంపి తినేవాడని ఆరోపణలు ఉన్నాయి. పాస్టర్ స్టీవెన్ ముగాంబే ఇంట్లోకి చొరబడిన మోసెస్.. ఇంట్లో ఉన్నవారందరిని కిరాతంగా హత్య చేశాడు. మరికొన్నిసార్లైతే ప్రేమ, సంబంధాల పేరుతో అమాయక ప్రజలను ఆకర్షించి.. వారిని పొట్టనపెట్టుకునేవాడనే ఆరోపణలు ఉన్నాయి.
మోసెస్‌ను గతంలో పోలీసులు చాలాసార్లు పట్టుకున్నప్పటికీ .. వివాదాస్పద స్థితిలో తప్పించుకోవడం .. లేదంటే బెయిల్‌పై విడుదల కావడం జరిగింది. తాజాగా అరెస్ట్ (Uganda Serial Killer Mujurizi Moses Arrested )చేసిన తర్వాత నిందితుడి ఇంటి నుంచి అధికారులు స్పష్టమైన ఆధారాలను సేకరించారు. తన నివాస ప్రాంతంలో నమోదైన పాత కేసులు.. మిస్సింగ్ కేసులు, హత్య కేసులకు మోసెస్ సంబంధం ఉందా? అనే కోణంతో ఎంక్వైరీ చేస్తున్నారు. మోసెస్ అరెస్ట్‌తో దశాబ్ధానికి పైగా కొనసాగుతున్న హత్య వెనుక ఉన్న మిస్టరీ వీడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇతడిని బహిరంగంగా విచారించి, కచ్చితంగా ఉరితీస్తామని జనరల్ కైనెరుగబా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.



