Para Games Gold Medalist Neeraj Yadav Dies

ఆసియా పారా క్రీడల్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించి.. దేశ కీర్తిని, మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన స్టార్ అథ్లెట్ నీరజ్ యాదవ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జీవితంపై విరక్తిపుట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని తన నివాసంలో విషం తాగి సూసైడ్‌ చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నీరజ్‌ యాదవ్ మృతి(Para Games Gold Medalist Neeraj Yadav Dies) చెందినట్లు భారత్ పారా అథ్లెటిక్స్ జట్టు కోచ్ సత్యనారాయణ కన్ఫార్మ్ చేశారు. నీరజ్ యాదవ్ మృతితో భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారత క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. నీరజ్‌ యాదవ్ సూసైడ్ చేసుకోవడం చాలా దురదృష్టకరమని కోచ్ సత్యనారాయణ తెలిపారు. ఇలా జరగడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఇటీవల జరిగిన ఆసియా పారా గేమ్స్‌కు డోపింగ్ నిషేదం కారణంగా నీరజ్ యాదవ్ అర్హత కోల్పోయారు. ఈకారణంగానే ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటారని పలువురు భావిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం డెడ్‌బాడిని ఆస్పత్రికి తరలించారు. నీరజ్ యాదవ్ మృతి(Para Games Gold Medalist Neeraj Yadav Dies)పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అనేక కోణాల్లో ఎంక్వైరీ చేయనున్నారు. కోనీరజ్ మృతికి డోపింగ్ నిషేదమే కారణమని కచ్చితంగా చెప్పలేనన్నారు కోచ్ సత్యనారాయణ. ఒక క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా స్వీకరించగలగాలన్నారు. అయితే నీరజ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధేస్తోందన్నారు.

నీరజ్ యాదవ్ శారీరకంగా వైకల్యం ఉన్నా.. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఏడేళ్ల వయసులో పోస్ట్ – పోటియో రెసిడ్యువల్ ప్యారాలిసిస్‌కు గురైన నీరజ్.. మొదట వీల్‌ చైర్‌ టెన్నిస్‌లో రాణించి.. ఆతర్వాత పారా- అథ్లెటిక్స్‌లోకి అడుగుపెట్టాడు. నీరజ్ యాదవ్(Para Games Gold Medalist Neeraj Yadav Dies) F55 కేటగిరిలో పోటీపడుతూ ఇంటర్నేషనల్ వేదికలపై దేశాన్ని గర్వకారణంగా నిలిపాడు. గోల్డ్ మెడల్ సాధించాలనే పట్టుదలతో కష్టాలను తట్టుకుని ఈస్థాయికి వచ్చాడు. 2018 జకార్తా ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు. 2023 హాంగ్‌జౌలో జరిగిన క్రీడల్లో జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఇండియాకు చెందిన ప్రతిభావంతులైన పారా అథ్లెట్లలో నీరజ్ యాదవ్ ఒకరు.