కార్తీక దీపారాధనకు ఏ నూనే వాడాలి..!
కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు ఎంతో విశిష్టత ఉంది. చీకటిని తొలగించే ఈచిన్న దీపం.. జీవితంలో జ్ఞానవెలుగులను నింపే గొప్ప సందేశం. కార్తీకమాసంలో వెలిగించే ప్రతి జ్యోతి మనలోని అజ్ఞానాన్ని తొలగించి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలనే ఆకాంక్షకు ప్రతిరూపం.

Karthika Masam Deepam Significance
కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు ఎంతో విశిష్టత ఉంది. చీకటిని తొలగించే ఈచిన్న దీపం.. జీవితంలో జ్ఞానవెలుగులను నింపే గొప్ప సందేశం. కార్తీకమాసంలో వెలిగించే ప్రతి జ్యోతి మనలోని అజ్ఞానాన్ని తొలగించి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలనే ఆకాంక్షకు ప్రతిరూపం. దీపజ్యోతి(Karthika Masam Deepam Significance) పరబ్రహ్మ స్వరూపం.. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే పవిత్ర సాధనం. అందుకే కార్తీకమాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది.
నెయ్యి బెస్ట్..!
కార్తీకమాసంలో దీపారాధనకు ఆవు నెయ్యి అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదమని హిందూ సంప్రదాయాలు చెప్తాయి. నెయ్యి దీపం వెలుగు మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనకు ఏకాగ్రతను అందిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పురాణాలు, ధార్మిక విశ్వాసాల ప్రకారం నెయ్యి దీపానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే నెయ్యి దీపం వెలిగించడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయని, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు. కానీ వారి వాదనలకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంట్లో నిత్యం దీపారాధన(Karthika Masam Deepam Significance) చేయడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడటంతో పాటు మనసులో భక్తిభావం పెంపొందుతుందని చెబుతారు.
నెయ్యి లేకపోతే ?
ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు స్వచ్ఛమైన నువ్వుల నూనెతోనూ దీపారాధన చేసుకోవచ్చని చెబుతున్నారు. సంప్రదాయంలో నువ్వుల నూనెకు కూడా విశిష్ట స్థానం ఉంది. కొబ్బరి నూనెతోనూ కొన్ని ప్రాంతాల్లో దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా గణపతి ఆరాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించే ఆచారం కనిపిస్తుంది. దీపారాధన చేసేటప్పుడు కొన్ని సంప్రదాయ నియమాలను పాటిస్తారు. సాధారణంగా మూడు లేదా ఐదు వత్తులతో దీపం(Karthika Masam Deepam Significance) వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. కనీసం రెండు వత్తులైనా ఉండాలని చెబుతారు. ఒకే వత్తితో దీపారాధన చేయకూడదనే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ప్రమిదను నేరుగా నేలపై ఉంచకుండా తమలపాకు లేదా చిన్న పళ్లెంపై ఉంచి దీపం వెలిగిస్తారు. అనంతరం పూలు లేదా అక్షింతలు సమర్పించి భక్తిశ్రద్ధలతో నమస్కరించుకుంటారు.
ఆకాశదీపం ప్రత్యేకత
కార్తీకమాసంలో కనిపించే మరో విశిష్టమైన ధార్మిక సంప్రదాయం ఆకాశదీపం. ఈ మాసంలో దేవాలయాల్లో ధ్వజస్తంభంపై ఆకాశదీపాన్ని వెలిగించి ఎత్తులో వేలాడదీస్తారు. చిన్న చిన్న రంధ్రాలు కలిగిన గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి, వత్తులు వేసి దీపాన్ని(Karthika Masam Deepam Significance) వెలిగిస్తారు. తాడు సహాయంతో ధ్వజస్తంభం పైభాగంలో ఏర్పాటు చేస్తారు. ఆకాశమార్గంలో సంచరించే పితృదేవతలకు మార్గదర్శకంగా ఈ దీపాన్ని వెలిగిస్తారనేది ఒక ధార్మిక విశ్వాసం. పితృదేవతలను స్మరించుకుంటూ వారి అనుగ్రహాన్ని కోరుకోవడం ఈ ఆచారంలోని ప్రధాన అంతరార్థం. ఆకాశదీపాన్ని శివకేశవుల దివ్య తేజస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఎత్తైన ప్రదేశంలో ప్రకాశించే ఈ జ్యోతి అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానవెలుగులను నింపాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది.



