దుర్గగుడిలో వీఐపీ దర్శనాలు రద్దు..
VIP Break Darshan Cancelled at Durga Temple: అమ్మవారి జన్మ నక్షత్రం .. మూల నక్షత్రం రోజున దుర్గమ్మ .. సరస్వతీ అలంకారణంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు

VIP Break Darshan Cancelled at Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా దుర్గగుడి ఈవో శీనానాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మవారి జన్మ నక్షత్రం .. మూల నక్షత్రం రోజున దుర్గమ్మ .. సరస్వతీ అలంకారణంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ఈనిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
మూలా నక్షత్రం సందర్భంగా అర్థరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తామని తెలిపారు అధికారులు. ఐదు క్యూలైన్లను కూడా సర్వదర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు కేటాయిస్తామని తెలిపారు. సామాన్య భక్తులను దృష్టిపెట్టుకుని ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దసరా ఉత్సవాల్లో భక్తులు దుర్గమ్మ దర్శనానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారని రోజుకు లక్షకు పైగా భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు. గడిచిన ఐదు రోజుల్లో 7లక్షలకు పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లలో వేచిఉండే భక్తులకు వాటర్, మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు రద్దీని పరిశీలించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.


