దుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం కానుక
Durga Ammavaru Gifted Golden Crown: విజయవాడ దుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని భక్తుడు అందించారు.

Durga Ammavaru Gifted Golden Crown: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్న వేళ ఓ భక్తులు అమ్మవారిక విలువైన కిరీటం బహుకరించారు. రూ. 75లక్షలు విలువైన స్వర్ణ కిరీటాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె. దుర్గా శ్రీనివాస్ కానుకగా అందించారు. అమ్మవారిపై తమకు ఉన్న భక్తిని చాటుకున్నారు. ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో నవరత్న ఖచిత కిరీటాన్ని రూపకల్పన చేశారు. గురువారం ఆలయ ఈవో వీకే శీనానాయక్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ త్రినాథరావుకు దాతలు ఈకిరీటాన్ని అందజేశారు. 494 గ్రాముల బరువుతున్న ఈ సర్వ కిరీటం దాదాపు రూ. 75లక్షలు చేస్తుందని తెలుస్తోంది.
విలువైన కిరీటాన్ని అందజేసిన దాతల కుటుంబానికి ఆలయ అధికారులు అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. శేష వస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి ప్రతిమతో దాతలను సత్కరించారు. అమ్మవారి దయతో తాము కిరీటాన్ని సమర్పించుకోగలిగామని దాత దుర్గా శ్రీనివాస్ తెలిపారు. ఆలయంలో శరన్నవరాత్రి ఏర్పాట్లు చాలా బాగున్నాయని ప్రసంశించారు.


