జగనే టార్గెట్..! ఈ నెల 11న సాయిరెడ్డి పార్టీ ఆవిర్భావం
మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ మాజీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఈనెల 11న కొత్త పార్టీ అనౌన్స్ చేస్తున్నారు. 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కొత్త పార్టీని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజే పార్టీ పేరు, జెండా, ఎజెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.

VijaysaiReddy New partyLaunch
మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ మాజీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఈనెల 11న కొత్త పార్టీ అనౌన్స్ చేస్తున్నారు. 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కొత్త పార్టీని (VijaysaiReddy New partyLaunch)ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజే పార్టీ పేరు, జెండా, ఎజెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొత్త పార్టీలో చేరికల ప్రక్రియను కూడా ప్రారంభించారు. విశ్వహిందూ పరిషత్లో దశాబ్దాలుగా పనిచేసిన సుమతి రెడ్డి, హిందూ ఎస్సీ, ఎస్టీ కులాల పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బోని గణేశ్ విజయసాయిరెడ్డి సమక్షంలో కొత్త పార్టీలో చేరారు. వీరి చేరికలను ఆయన స్వాగతించారు. అంతేకాదు.. సుమతిరెడ్డి రాబోయే ఎన్నికల్లో తిరుపతి జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని, నియోజకవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
70 అవమానాలు
ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి.. వైసీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నుంచి తాను స్వచ్ఛందంగా బయటకు రాలేదని.. అవమానాలు భరించలేక పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. జగన్ తనను పొమ్మనకుండా పొగబెట్టారని, ఒక మనిషిగా భరించలేని పరిస్థితులు కల్పించారని ఆరోపించారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 70కి పైగా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తనకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, జగన్ చెప్పుడు మాటలు విని తనను దూరం పెట్టారని విమర్శించారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు అక్కడ కొనసాగడం సాధ్యం కాలేదని ఆవేదన (VijaysaiReddy New partyLaunch)వ్యక్తం చేశారు.
కాషాయ ప్రభావం లేదు
కొత్త పార్టీ ప్రకటనకు సమయం దగ్గరపడుతున్న వేళ.. విజయసాయిరెడ్డి పార్టీలో కాషాయ ప్రభావం ఎక్కువగా ఉందన్న విమర్శలపై ఆయన స్పందించారు. భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం గురించి మాట్లాడటం ఇతర మతాలను వ్యతిరేకించడం కాదని స్పష్టం చేశారు. క్రైస్తవులు, ముస్లింలు సహా దేశంలోని ప్రతి ఒక్కరికీ భారతీయ మూలాలున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని మతాలు, కులాలు, వర్గాలకు సమన్యాయం చేయడమే తమ లక్ష్యమని(VijaysaiReddy New partyLaunch) చెప్పారు. ఇక రాజకీయాల విషయానికొస్తే.. రాష్ట్రాన్ని రెండు కుటుంబాల చేతుల్లోనే ఉంచకూడదని, అధికార కేంద్రీకరణకు స్వస్తి పలకాలన్నది తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు. అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తామని, యువతను నాయకత్వ స్థానాల్లోకి తీసుకొస్తామని చెబుతున్నారు. ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరు, విద్యుత్, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పేద మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పెంచడం వంటి అంశాలను కూడా తన పార్టీ ఎజెండాలో ప్రస్తావించారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు భిన్నంగా మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.



