నగరవాసుల తిరిగి పయనం.. హైవేపై భారీ రద్దీ
చిట్యాల, చౌటుప్పల్లో అండర్ పాస్ వంతెన పనులు నడుస్తుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు, హైవే సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్దీ కరిస్తున్నారు.

Heavy Traffic Jam: దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లిన నగర వాసులు హైదరాబాద్ సిటీకి తిరిగిపయనం కావడంతో పలు హైవేలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. టోల్ ప్లాజా దగ్గర ఇరువైపులా కలిపి మొత్తం 18 టోల్ బూతులు ఉండగా.. ట్రాఫిక్ జామ్‌ను దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజా అధికారులు హైదరాబాద్ మార్గంలో 12 టోల్ బూత్‌లను తెరిగి వాహనాలను పంపిస్తున్నారు. ఫాస్టాగ్ విధానం అమలులోకి ఉన్నా వాహనాల రద్దీతో ప్లాజా దగ్గర కిలో మీటర్ మీర వాహనాలు నిలిచిపోయాయి.
చిట్యాల, చౌటుప్పల్లో అండర్ పాస్ వంతెన పనులు నడుస్తుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు, హైవే సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. దసరా సెలవుల తర్వాత ఉద్యోగులు, విద్యార్థులు తిరిగి నగరాలకు చేరుకుంటుండటంతో హైదరాబాద్–విజయవాడ హైవేపై రద్దీ నెలకొంది. ప్రయాణికులు సహనం పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలను అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ వైపు ప్రయాణించే వాహనదారులు టోల్ చెల్లింపుల్లో ఆలస్యం కాకుండా ఫాస్టాగ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉందో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాల్లో నిర్మాణ పనుల దగ్గర వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.



