ఇజ్రాయెల్‌లో పొలిటికల్ టెన్షన్.. ప్రధాని ఎవరూ..?
Israel elections 2026: ఇజ్రాయెల్‌లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. విదేశాల్లో ఉంటున్న లక్షలాది మంది ఓటు వేసేందుకు ఇజ్రాయెల్‌కు క్యూ కట్టారు. దీంతో ఎన్నికల్లో నెతన్యాహుకు అవకాశం ఇస్తారా..? లేక ప్రతిపక్ష పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారా..? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Israel elections 2026: ఓవైపు యుద్ధం చేస్తూనే మరోవైపు ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్స్ హీట్ పీక్స్‌కి చేరింది. ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు (Voters) వినియోగించుకునేందుకు కేవలం దేశంలోని ప్రజలే కాకుండా.. ఇతర దేశాల్లో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులు.. స్వదేశానికి వచ్చారు. సుమారు 73 లక్షల మంది ఓటర్ల (Voters) ఇజ్రాయెల్ ప్రధాని ఎవరూ అని నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఇది రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇజ్రాయెల్ పౌరులకు (Israel elections) విదేశాల్లో ఉండి ఓటు వేసేందుకు పోస్టల్ లేదా ఆన్లైన్ ఓటింగ్ సౌకర్యం లేదు. దీంతో తమ దేశ భవిష్యత్తును, పాలకులను ఎన్నుకునే ప్రక్రియలో భాగస్వాములు కావడానికి వేలాది మంది పౌరులు స్వయంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఈ ఎన్నికల కోసం దాదాపు 67 వేల మంది ఇజ్రాయెలీలు స్వదేశానికి చేరుకునే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ మంది అమెరికా నుంచి రాగా.. యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ చేరుకున్నారు. వీరంతా తమ ప్రయాణ ఖర్చులను స్వయంగా భరిస్తూ మరీ ఓటు వేసేందుకు వచ్చారు.
నెతన్యాహుకు కొత్త తలనొప్పులు..
విదేశాల నుంచి వస్తున్న ఓటర్ల రాక.. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు (Netanyahu) కొత్త రాజకీయ తలనొప్పులను తెచ్చిపెడుతుందన్న చర్చ జరుగుతోంది. విదేశాల్లో నివసించే వారిలో ఎక్కువ మంది తమ స్వదేశంలో రాజకీయ మార్పును కోరుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లోనూ నెతన్యాహుకు (Netanyahu) వ్యతిరేకంగా భారీ నిరసనలు, నినాదాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతుండటంతో.. ఈ విదేశీ ఓట్లు ఫలితాలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల సర్వేల ప్రకారం.. ఈ విదేశీ ఓట్లు సుమారు రెండు స్థానాల ఫలితాలను తారుమారు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో జరగనున్న ఎన్నికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (America) కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు మరోసారి అధికారంలోకి రావాలని తాను ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. నెతన్యాహు కాకుండా మరో నేత వస్తే ఇరాన్ విషయంలో అమెరికాపై మరింత భారం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు నెతన్యాహు శిబిరానికి కొంత ఊతమిచ్చినప్పటికీ, ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి.
ఇజ్రాయెల్‌లో మొత్తం 73 లక్షల మంది ఓటర్లు
ఇజ్రాయెల్‌లో (Israel elections) మొత్తం 73 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 స్థానాల మ్యాజిక్ ఫిగర్ అవసరం. తాజా సర్వేల ప్రకారం ప్రతిపక్ష కూటమికి కొన్ని స్థానాలు ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించినా, ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. అక్టోబర్ 27న పోలింగ్ జరగనుంది. రాత్రి పది గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అక్టోబర్ 28న తెల్లవారుజామున నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అక్టోబర్ 29 మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తై తుది ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నవంబర్ 4 వరకు అధికారికంగా ఫలితాలను ప్రకటించేందుకు గడవు ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో (Israel elections) పోటీ రసవత్తరంగా మారింది. మరి విదేశాల నుంచి వస్తున్న ఓటర్లు ఎవరికి మద్దతిస్తారు.. నెతన్యాహు మరోసారి విజయం సాధిస్తారా లేక ప్రతిపక్షం అధికారాన్ని దక్కించుకుంటుందా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..
నెతన్యాహకు తలనొప్పిగా ఇరాన్- హమాస్ యుద్ధం
ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధానిగా ఉన్న నెతన్యాహుకు (Netanyahu) హమాస్- ఇరాన్ యుద్ధం తలనొప్పిగా మారాయి. ఎనిమిది నెలలుగా చేస్తున్న యుద్ధం సామాన్యులతో పాటు.. భారీగా సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా 202౩లో హమాస్ ఉగ్రవాదులు సరిహద్దులు దాటుకొని ఇజ్రాయెల్‌లోకి ఎలా వచ్చారనే దానిపై బాధిత కుటుంబాలు నిలదీస్తున్నాయి. దీంతో నెతన్యాహుపై (Netanyahu) కొంత వ్యతిరేకత ఉందని అక్కడ మీడియా కథనాలు చెబుతున్నాయి. మరోవైపు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో అమెరికాకు అనుకూలంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం రెండు యుద్ధాలు నెతన్యాహును గెలిపిస్తాయా.. ? లేక ఓటమి దిశకు చేరుస్తాయా అన్నది తెలుసుకోవాలంటే బుధవారం వరకు వేచి చూడాల్సిందే..



