India Moves Up to Fourth in WTC Points Table

కివీస్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ ఇండియాకు గుడ్‌ న్యూస్ అందింది. మరికొన్ని రోజుల్లో టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన ర్యాంకింగ్ భారత్‌కు మరింత భారీ బూస్టింగ్ ఇచ్చింది. ఇదే ఊపుతో భారత్ చెలరేగిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పటికే టీ20లో టీమ్‌ ఇండియా సూపర్‌ ఫామ్‌లో సిరీస్‌ను గెలిచింది. అయితే భారత్‌కు వచ్చిన తాజా ర్యాంగింగ్.. మన జట్టు గెలిస్తే రాలేదు.. పాయింట్ల పట్టికలో మనకంటే ముందు ఉన్న టీం ఓడిపోతే మన ర్యాంకు మెరుగుపడింది. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న విస్టిండీస్ టీం సొంతగడ్డపై బంగ్లాజట్టును ఓడించింది. భారత్‌ నెత్తిన పాలు పోసింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో టీమిండియాకు అనూహ్యంగా కలిసొచ్చింది. బంగ్లాదేశ్ ఓటమితో భారత్ ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ ఒక స్థానం(India Moves Up to Fourth in WTC Points Table) మెరుగుపరుచుకుంది.

ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ టెస్టులో, నాలుగో రోజు వెస్టిండీస్ 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ అజేయంగా 81 పరుగులు చేయగా, కావెమ్ హాడ్జ్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో విండీస్ జట్టు కేవలం 35.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెస్టీండీస్‌ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ 55.56% పాయింట్లతో నాలుగో స్థానం ఉంది. భారత్ 51.52% పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కరేబియన్ జట్టుపై ఓటమితో బంగ్లాదేశ్ పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ 47.62%కి పడిపోయింది. దీంతో వారు భారత్ కంటే కిందకు, అంటే ఐదో స్థానానికి చేరారు. దీంతో ఎలాంటి మ్యాచ్ ఆడకుండానే భారత్ నాల్గో స్థానానికి (India Moves Up to Fourth in WTC Points Table)ఎగబాకింది. ఈ విజయంతో వెస్టిండీస్ పీసీటీ 20.83% నుంచి 26.92%కి పెరిగింది. మ్యాచ్ గెలిచిన అనంతరం విండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ మాట్లాడుతూ.. “ర్యాంకింగ్స్‌లో పైకి వెళ్లే లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చామన్నారు. రెండు టెస్ట్‌లో కూడా గెలిచి పట్టికలో కనీసం ఐదు లేదా ఆరో స్థానంలో నిలవాలడమే తమలక్ష్యమని చెప్పాడు.

డబ్యూటీసీలో ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్‌కు పెద్ద సవాల్‌ ఎదురవుతోంది. ఇప్పడు ఆడబోయే ప్రతీ మ్యాచ్‌ టీమ్‌ ఇండియాకు కీలకం. కివీస్‌ సొంత గడ్డపై కఠినమైన సవాల్‌ను భారత్ ఎలా స్వీకరిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. కివీస్‌ను స్వంత గడ్డపై టెస్టుల్లో ఓడిస్తే ..టీమ్‌ ఇండియా డబ్యూటీసీ టుబుల్‌లో ముందుకు దూసుకొస్తుంది. ప్రజెంట్ భారత్ 51.52 శాతంతో నాల్గో ప్లేస్‌లో ఉంది. ఆస్ట్రేలియా 80శాతంతో ఫస్ట్ ప్లేస్‌.. 75 శాతంతో సౌత్ ఆఫ్రికా రెండో ప్లేస్.. 72.22 న్యూజిలాండ్ మూడో స్థానం(India Moves Up to Fourth in WTC Points Table)లో ఉన్నాయి. ఇప్పుడు కివీస్‌తో జరగబోయే రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో గెలిస్తే టీమ్‌ ఇండియా మూడో ప్లేస్‌ కు వస్తుంది. అదే ఒక్క మ్యాచ్‌ ఓడినా ఫైనల్ రేస్‌ నుంచి తప్పుకుంటుంది.