India vs New Zealand 4th ODI

జోరుమీదున్న టీమ్‌ ఇండియాకు కివీస్ కళ్లేం వేసింది. నాల్గో వన్డేలో కసీతీరా ఓడించింది. గతరెండు మ్యాచ్‌లో ఓటమిని కసితీర్చుకుంది. మౌంట్ మాంగ‌నూయ్ వేదిక‌గా జరిగిన నాల్గో వన్డేలో టీమ్‌ ఇండియా 244 పరుగుల తేడాతో ఘోరంగా పరాజయంపాలైంది(India vs New Zealand 4th ODI). వన్డేల్లో అతిపెద్ద రెండో ఓటమిని చవిచూసింది. 2000 అక్టోబర్ 29న శ్రీలంకతో జరిగిన వన్డేలో 245 పరుగుల తేడాతో అప్పుడు భారత్ ఓటమి పాలైంది.

ఘోర ఓటమి
మొదటిరెండు వన్డేల్లో గిల్‌ గెప్టెన్సీలో టీమ్‌ ఇండియా గెలుపొందింది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. నాల్గోవన్డేలో గిల్ లేనికారణంగా టీ20 కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ ఈమ్యాచ్‌కి సారధ్య బాధ్యతలు వహించాడు. టాస్‌ గెలిచిన అయ్యర్ సేన .. ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌ జట్టు.. 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్‌ బ్యాటర్లలో విల్ యంగ్ (125) పరుగులు చేశాడు. సెంచరీతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. టీమ్‌ సీఫెర్ట్‌(58) పరుగులు చేశాడు. ఇక భారత్‌(India vs New Zealand 4th ODI) బౌలర్లలో అకిబ్ నబీ, గుర్నూర్‌ బ్రార్‌, అక్షర్‌ పటేల్‌ తలో రెండు వికెట్లు, అర్ష్‌దీప్‌, నమన్‌ దీర్‌ చెరో వికెట్ తీశారు.

ఐదో వన్డేలపై ఉత్కంఠ
కివీస్‌ నిర్దేశించిన 334 పరుగుల టార్గెట్‌ చేధించే క్రమంలో టీమ్‌ ఇండియా ఘోరంగా విఫలమైంది. ఆదిలోనే వరుసగా వికెట్లు సమర్పించుకుంది. రోహిత్, కోహ్లీ, అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. భారత టాపార్డర్‌ వరుసగా 0,5,0,0 స్కోర్లు నమోదు చేయడం టీమ్‌ ఇండియా ఓటమిని ఖరారు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 27, అక్షర్‌ పటేల్ 21, నమన్‌ ధీర్‌ 21 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. భారత్‌ 89 పరుగులకు ఆలౌట్ అయింది. 245 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. 5వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-1తో ముందంజలో ఉంది. 5వ వన్డేలో పుంజుకుంటుందా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సిరీస్‌లో కీలక మ్యాచ్లో కివీస్(India vs New Zealand 4th ODI) పుంజుకుంది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఈమ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో కివీస్‌ రాణించింది. ఐదో వన్డేలో కూడా న్యూజిలాండ్ గెలిస్తే.. సిరీస్ సమంకానుంది. దీంతో 5వ వన్డేపై ఉత్కంఠ నెలకుంది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యార్.. సెంకండ్‌ ఇన్నింగ్‌కు వచ్చేసరికి పిచ్‌ స్వభావం పూర్తిగా మారిపోయిందన్నారు. మాట్ హెన్రీ బౌలింగ్‌ అద్భుతంగా ఉందన్నారు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పాడు. 330+ టార్గెట్‌ను ఛేదించగలమని ముందు భావించామన్నారు. పిచ్ ప్రభావంతో కివీస్‌కు కలిసొచ్చిందన్నారు అయ్యర్.

గత చరిత్ర
ఈవన్డేలో ఒక్క పరుగుతో భారత్ పెద్ద గండం నుంచి గట్టెక్కింది. గ‌తంలో 2000, అక్టోబ‌ర్ 29న శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డేలో 245 ప‌రుగుల తేడాతో ఓటమి(India vs New Zealand 4th ODI) భారత్‌కు అతిపెద్ద ఓటమిగా ఉంది. తాజాగా ప‌రుగు తేడాతో అతిపెద్ద ఓటమి గండాన్ని తప్పించుకుంది. ఇక 2015లో సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో 214 ప‌రుగుల ఓట‌మి భార‌త్‌కు మూడో అతిపెద్ద ఓట‌మిగా ఉంది. 2004లో సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 208 ప‌రుగుల ఓట‌మి భార‌త్‌కు నాలుగో అతిపెద్ద ఓట‌మిగా ఉంది.