సూర్యకుమార్ విధ్వంసం.. వైభవ్ ప్రపంచ రికార్డు!
ఒకే రోజు ఇద్దరు భారత యువ సంచలనాలు రికార్డులు క్రియేట్ చేశారు. 15 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ చేయగా.. టీ20 చరిత్రలో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు.

Vaibhav Suryavanshi World Record
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో భారత క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా లభించింది. ఒకవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొడితే.. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సూర్య తన బ్యాటింగ్‌తో ముంబైకి విజయాన్ని అందించగా, వైభవ్ కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి చరిత్ర(Vaibhav Suryavanshi World Record) సృష్టించాడు.
15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
చాలా రోజుల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను మరోసారి బయటకు తీశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా బరిలోకి దిగిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో
172 పరుగులకు ఆలౌట్ అయింది. 173 రన్స్ టార్గెట్ చేసేందుకు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ (Suryakumar Yadav) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 21 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య విధ్వంసంతో ముంబై జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, ఆరు ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తర్వాత సూర్యకు ఇదే తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ కావడం విశేషం.
15 ఏళ్లకే వైభవ్ ప్రపంచ రికార్డు!
మరోవైపు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టీ20 చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో ఓ జట్టుకు కెప్టెన్సీ వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బీహార్ జట్టుకు కెప్టెన్‌గా చేశాడు వైభవ్. వైభవ్ వయసు కేవలం 15 ఏళ్ల 232 రోజులు మాత్రమే. ఇప్పటివరకు ఈ రికార్డు క్రొయేషియాకు చెందిన జాక్ వుకుసిచ్ పేరిట ఉండేది. అతడు 17 ఏళ్ల 311 రోజుల వయసులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును అధిగమించి చరిత్ర (Vaibhav Suryavanshi World Record)సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మాత్రం వైభవ్ పెద్దగా రాణించలేకపోయాడు. 12 బంతుల్లో 18 పరుగులు చేసి చేతన్ సకారియా బౌలింగ్‌లో క్యాచ్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈమ్యాచ్‌లో బీహార్ కూడా సౌరాష్ట్ర మీద ఓడిపోయింది. బీహార్ 20 ఓవర్లకు 9వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర 16.3 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి బీహార్ టార్గెట్‌ను చేధించింది.
🔴 VAIBHAV SURYAVANSHI DISMISSED FOR 18 (12) ON HIS CAPTAINCY DEBUT 🤯
– BTW, Vaibhav is playing only One match of SMAT 2026 due to his hectic schedule. 🫡 https://t.co/qw9bT7Nx9T
— Sam (@cricsam02) November 14, 2026
భారత క్రికెట్‌కు కొత్త ఉత్సాహం!
ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్.. మరోవైపు చిన్న వయసులోనే ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇలా ఇద్దరూ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూర్య తన మెరుపు ఇన్నింగ్స్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సంకేతాలివ్వగా, వైభవ్(Vaibhav Suryavanshi World Record) తన నాయకత్వ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఇద్దరి ప్రదర్శనలు భారత టీ20 క్రికెట్‌లో అనుభవానికి, యువ ప్రతిభకు ఉన్న ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పాయి.మొత్తానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య, వైభవ్ ఇద్దరూ తమదైన ముద్ర వేశారు!



