ప్రయోగాలు వద్దు.. పాత కెప్టెనే ముద్దు
ఐపీఎల్ అభిమానులకు, హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌కి ఇది అదిరిపోయే న్యూస్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు గత మూడు సీజన్‌లలో చావుదెబ్బ తిన్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు కళ్లు తెరిచింది. జట్టులో విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Rohit Sharma Mumbai Indians Captain
మూడేళ్ల తర్వాత మళ్లీ పగ్గాలు!
ఐపీఎల్ అభిమానులకు, హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌కి ఇది అదిరిపోయే న్యూస్. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు గత మూడు సీజన్‌లలో చావుదెబ్బ తిన్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు కళ్లు తెరిచింది. జట్టులో విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ పగ్గాలు మళ్లీ హిట్‌మ్యాన్(Rohit Sharma Mumbai Indians Captain) చేతుల్లో పెట్టింది. ఇన్నాళ్లు అనవసరపు ప్రయోగాలు చేసేనోమోననే అభిప్రాయానికి వచ్చింది. ఎట్టకేలకు ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ముంబై జట్టులో కీలక పరిణామాలు చేటుచేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తిరిగి కెప్టెన్‌గా నియమించింది. నవంబర్ 27న ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో సందడి నెలకొంది. 2024 సీజన్‌కు ముందు రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. తాజాగా హార్దిక్ పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ కావడంతో ముంబై యాజమాన్యం మరోసారి తన విజయవంతమైన మాజీ సారథిపైనే నమ్మకం ఉంచింది.
Smile, everybody smile 💙
#MumbaiIndians #CaptainRo https://t.co/YUqYZTQxu9
— Mumbai Indians (@mipaltan) November 27, 2026
మళ్లీ పాత రోజులొస్తాయా?
ముంబై ఇండియన్స్ చరిత్రలో రోహిత్ శర్మది ప్రత్యేక స్థానం. 2013లో జట్టు కెప్టెన్సీ చేపట్టిన ఆయన.. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ఆజట్టుకు అందించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్లలో(Rohit Sharma Mumbai Indians Captain) ఎంఎస్ ధోనీతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే 2023 సీజన్ తర్వాత రోహిత్‌ను తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హార్దిక్ సారథ్యంలో ముంబై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మూడు సీజన్లలో ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగింది.
Carved by Legacy, Sculpted for Greatness. 👑
#CaptainRo, Aala Re! 💙#MumbaiIndians https://t.co/ceitupA2Y7
— Mumbai Indians (@mipaltan) November 27, 2026
ఆరో టైటిల్‌పై గురి!
హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు పంపిన ముంబై ఇండియన్స్.. అతడి స్థానంలో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ ట్రేడ్‌తో కెప్టెన్సీ మార్పునకు కూడా మార్గం సుగమమైంది. ఇప్పుడు 2027 ఐపీఎల్‌లో రోహిత్ సారథ్యంలో బరిలోకి దిగనున్న ముంబై ఆరో టైటిల్‌పై(Rohit Sharma Mumbai Indians Captain) కన్నేసింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా పేరున్న రోహిత్ తిరిగి పగ్గాలు చేపట్టడంతో జట్టు అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మరి హిట్‌మ్యాన్ తన నాయకత్వంలో ముంబైకి మరోసారి ట్రోఫీ అందిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
“We bid for Rohit in 2011, and from that moment, he became part of our Mumbai Indians family.
I still remember the young Rohit who joined us, and it has been such a joy and privilege to watch him grow over the years as a cricketer, a champion, a leader, and a wonderful family man.
As we celebrate the 20th season of Mumbai Indians, it is a very special moment for all of us to see Rohit lead the team once again. He has given us so many wonderful memories over the years, and I know how much he means to our Paltan.
I hope this new chapter brings many more moments of pride for him, for our team and for the millions of fans who love Mumbai Indians. Rohit, we are all cheering for you!”
– Mrs. Nita M. Ambani
— Mumbai Indians (@mipaltan) November 27, 2026



