SRH టు GT.. భారీ ట్రేడ్!.. రూ.4 కోట్లకే హర్షల్!
ఐపీఎల్ సీజన్ ఇంకా ఐదు నెలల గడువున్నా.. అప్పుడే హీట్ పెరిగింది. ఐపీఎల్ 2027కు ముందే ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా సీనియర్ పేసర్, రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి గుజరాత్ టైటాన్స్ (GT)కు ట్రేడ్ చేసేందుకు అంగీకరించింది.

Harshal Patel GT Trade IPL 2027
IPL సీజన్ ఇంకా ఐదు నెలల గడువున్నా.. అప్పుడే హీట్ పెరిగింది. ఐపీఎల్ 2027కు ముందే ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా సీనియర్ పేసర్, రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి గుజరాత్ టైటాన్స్ (GT)కు ట్రేడ్ చేసేందుకు అంగీకరించింది. ఈ ఆల్ క్యాష్ డీల్ విలువ రూ.4 కోట్లు. 2025 మెగా వేలంలో హర్షల్‌ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన SRH.. ఇప్పుడు అందులో సగం రూ. 4కోట్లకే అతడిని (Harshal Patel GT Trade IPL 2027)వదులుకుంది.
గత సీజన్లో తుస్..
హర్షల్ తన స్లోయర్ బాల్స్, డెత్ ఓవర్లలో వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఒత్తిడిలో వికెట్లు తీయగల సామర్థ్యం అతడి ప్రధాన బలం. 2025 సీజన్లో సన్‌రైజర్స్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్.. 13 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. 9.80 ఎకానమీతో ఆకట్టుకున్నాడు. అయితే 2026 సీజన్లో మాత్రం అతడి ప్రదర్శన పూర్తి భిన్నంగా ఉంది. కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడిన హర్షల్(Harshal Patel GT Trade IPL 2027) ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా 10.82 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో యువ భారత బౌలర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్‌లకు SRH ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. దీంతో హర్షల్ జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు.
GTకి అనుభవం..
హర్షల్ చేరికతో గుజరాత్ టైటాన్స్ పేస్ విభాగానికి మరింత అనుభవం, బలం చేకూరనుంది. ఇప్పటికే కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్ వంటి టాప్ బౌలర్లు GTలో ఉన్నారు. వీరితో కలిసి హర్షల్ తనదైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా అహ్మదాబాద్‌కు చెందిన హర్షల్‌కు(Harshal Patel GT Trade IPL 2027) ఇది సొంత గడ్డపై ఆడే అవకాశం దక్కింది. గతంలోను హర్షల్ పటేల్ కోసం గుజరాత్ బిడ్ వేసింది. 2024 వేలంలో రూ.10.5 కోట్ల వరకు, 2025 వేలంలో రూ.6.5 కోట్ల వరకు GT బిడ్డింగ్ చేసింది.
IPLలో రికార్డు!
2021లో RCB తరఫున ఆడిన హర్షల్ పటేల్.. 32 వికెట్లు తీశారు. 2024లో పంజాబ్ కింగ్స్ (PBKS) తరఫున ఆడి 24 వికెట్లు తీశాడు. ఆరెండు సీజన్లలోనూ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ట్రేడ్ అధికారికంగా ఖరారైతే RCB, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, SRH తర్వాత గుజరాత్ టైటాన్స్ హర్షల్‌కు(Harshal Patel GT Trade IPL 2027) ఐదో ఐపీఎల్ ఫ్రాంచైజీ కానుంది. రూ.8 కోట్ల ఆటగాడిని రూ.4 కోట్లకు వదులుకున్న SRH.. సొంత రాష్ట్రానికి చేరుతున్న హర్షల్.. GT బౌలింగ్ దళంలో ఈ అనుభవజ్ఞుడి పాత్ర ఎలా ఉండబోతోంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
SRH వ్యూహం
మరోవైపు ఈ ట్రేడింగ్ విండోలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Harshal Patel GT Trade IPL 2027) చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి టీ. నటరాజన్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నలుగురు ఆటగాళ్ల ట్రేడ్‌లో ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను సొంతం చేసుకుంది. నవంబర్ 17తో రిటెన్షన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఐపీఎల్ 2027కు ముందే ఫ్రాంచైజీల వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ట్రేడింగ్ డీల్స్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
Trade confirmed by SRH coach Varun Aaron
Harshal patel to Gujarat titans 💙 https://t.co/2nMe0PrVsv
— OrangeFever (@orangefever__) November 15, 2026



